3మరియు 5 తరగతుల 24 వ రోజు 26.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం.
తెలుగు
పిల్లలకు సరళమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం నేర్పించాలి ఒక కథ లేదా చిత్రం ఆధారంగా ప్రశ్నలు అడగాలి.ఉదాహరణకు చిత్రంలో ఎవరున్నారు? ఇక్కడ ఏమి జరుగుతోంది?
విద్యార్థులు ప్రశ్నలకు చిన్న వాక్యాలలో లేదా పదబంధాలలో సమాధానం చెప్పాలి ఉదాహరణకు ఇది అమ్మ ఇక్కడ పిల్లలు ఆడుతున్నారు.
ఆట:
ప్రశ్నల బంతి
ఒక సాఫ్ట్ బాల్ ను ఒకరికి విసరాలి. బంతి అందుకున్న విద్యార్థిని ఫీచర్ ఒక ప్రశ్న అడగాలి వారు సమాధానం చెప్పాలి ఆ తర్వాత మళ్లీ మరొకరికి బంతిని వేయాలి ఈ విధంగా గుండ్రంగా కొనసాగించాలి.
ENGLISH
Play and dance-Vocabulary :
పిల్లలకు fun మరియు action words ను చెప్పాలి. వస్తువులు మరియు యాక్షన్స్ చూపించాలి. వర్డ్స్ ను యాక్షన్స్ తో రిపీట్ చేయించాలి. పిల్లలకు కొన్ని బొమ్మలు చూపించి వాటి పేర్లు క్లియర్ గా చెప్పాలి. ఆ పేర్లకు తగిన యాక్షన్ చేయాలి ఈ విధంగా పిల్లల చేత కూడా యాక్టింగ్ చేయించాలి. ఎవరైతే సరిగ్గా యాక్షన్ చేశారు వారిని చప్పట్లతో అభినందించాలి.
Maths
Group project- My math book
నంబర్స్,షేప్స్,టైం,మనీ,గ్రాఫ్స్, డేటా ముఖ్యమైన టాపిక్స్ ను పిల్లలకు రివైజ్ చేయాలి. ప్రతిదానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు లెక్కలు ఇవ్వాలి పిల్లల చేత చేయించాలి ఉదాహరణకు నంబర్స్ సెక్షన్లో కౌంటింగ్, ఎడిషన్ లాంటివి షేప్స్ సెక్షన్ లో డ్రాయింగ్,ఆపస్ ఐడెంటిఫికేషన్ మనీ సెక్షన్ లో కాయిన్స్, కాలిక్యులేషన్స్ మొదలైనవి.
కలర్స్, స్టిక్కర్స్ మరియు డెకరేషన్స్ వంటి ఉపయోగించి A -4 షీట్ పై పిల్లలను పర్సనల్ గా మ్యాథ్స్ బుక్ లెట్ తయారు చేయమనాలి. ఎవరైతే చక్కగా తయారు చేశారో వారిని math star గా ప్రకటించి చప్పట్లతో అభినందించాలి.