విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 21 వ రోజు (23.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : కథకు సంబంధించిన కృత్యాలను నిర్వహించాలి. తర్వాత పిల్లల్లో ఒకరిని కథ మొత్తం సొంత మాటలలో చెప్పమని అడగాలి ఆ తర్వాత కథ గురించి ఎలా ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
మూడు అక్షరాల పదాలను విడదీసి చెప్పాలి.
అక్షరాలతో ఆట:
తరగతి గదిలో పిల్లలకు త, మ, బ, ల అక్షరాలను చూపించి వాటితో ఏర్పడే రెండక్షరాల పదాలను చెప్పించాలి వాటిని నోట్ పుస్తకంలో రాసుకోమని చెప్పాలి
వ్రాయడం :
అక్షర ఆకారంలో ఉన్న చుక్కల్ని కలుపుతూ అక్షరాలను రాయడం నేర్పించాలి. రోజుకు ఐదు నుంచి ఆరు అక్షరాలతో కృత్యాన్ని నిర్వహించాలి.
పాట-పద్యం:
అమ్మకు జేజే నాన్నకు జేజే పాటను పిల్లలకు పాడి వినిపించాలి.
ENGLISH
Shared book reading :
ఇప్పుడు మనం మనకు తెలిసిన కథనం చదవబోతున్నాం అని పిల్లలకు చెప్పాలి . ఆ చదవబోతున్న కథ విని ఎక్కడైతే వారు కూడా కలిపి చదవదలుచుకున్నారో అక్కడ నుంచి వారిని చదవమని చెప్పాలి. ఆ కథను గట్టిగా స్పష్టంగా చదివి వినిపించాలి. పిల్లల చేత కూడా స్పష్టంగా గట్టిగా చదివించాలి ఎవరైతే కథ చక్కగా చదివారో వారిని Story star గా గుర్తించి చప్పట్లతో అభినందించాలి.
Maths
Bridge builders :
పిల్లలకు కాగితాలు స్ట్రాలు బ్లాకులు టేపులు మొదలైన వస్తువులు సమకూర్చి వాటితో సింపుల్గా బ్రిడ్జ్ తయారు చేయమని చెప్పాలి. ఈ వస్తువులను ఉపయోగించి ఎవరైతే బాగా బలంగా ఉండే బ్రిడ్జి ను తయారు చేశారు వారిని strongest bridge builder పోటీలో నెగ్గినట్లుగా ప్రకటించాలి.
Readiness activity
Noise makers parade
పిల్లలకు బెల్స్,పూసలు ఉన్నటువంటి బాటిల్స్,పేపర్ డ్రమ్స్ మొదలైన వస్తువులను ఇవ్వాలి
వీటన్ని ఉపయోగిస్తూ స్లోగా ఫాస్టుగా, గట్టిగా నెమ్మదిగా శబ్దం చేయమని చెప్పాలి. ఇలా ఎవరైతే Rhythmic గా శబ్దం చేస్తారో వారిని చప్పట్లతో అభినందించాలి.