విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 24 వ రోజు (26.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : కథకు సంబంధించిన కృత్యాలను నిర్వహించాలి. తర్వాత పిల్లల్లో ఒకరిని కథ మొత్తం సొంత మాటలలో చెప్పమని అడగాలి ఆ తర్వాత కథ గురించి ఎలా ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
మూడు అక్షరాల పదాలలో ఆఖరి అక్షర ధ్వనిని మార్చి చెప్పాలి.
అక్షరాలతో ఆట:
టీచర్ తరగతి గదిలో సరళ పదాలతో ఉన్న బొమ్మ ఫ్లాష్ కార్డులను చూపించి వాటి పేర్లను చెప్పించాలి ఉదాహరణకు పడవ,తబల, కడవ,పనస
వ్రాయడం:
అక్షర ఆకారంలో ఉన్న చుక్కల్ని కలుపుతూ అక్షరాలను రాయడం నేర్పించాలి. రోజుకు ఐదు నుంచి ఆరు అక్షరాలతో కృత్యాన్ని నిర్వహించాలి.
పాట-పద్యం:
అచ్చుల గేయం అమ్మ మొదటి దైవము అనే పాటను పిల్లల చేత పాడించాలి.
ENGLISH
Alphabet Hopscotch :
పిల్లలకు అక్షరాలపై గెంతుతూ ఆడే ఆట ఆడదాం అని చెప్పాలి. నెల పైన బాక్సులు గీసి వాటి మధ్యలో అక్షరాలు వ్రాయాలి అక్షరాలను వరుసగా కాకుండా మధ్య మధ్యలో వేరొక అక్షరాలను కలిపి రాయాలి. మనం చెప్పిన అక్షరాలపై పిల్లల దూకాలి అలా ఎవరైతే సరిగ్గా దొరుకుతారో వారిని Hopscotch Star గా గుర్తించి చప్పట్లతో అభినందించాలి.
Maths
Cause and effect match :
పిల్లలకు ఒక పని చేయడం వల్ల రెండవ పని ఏమి జరుగుతుందో ఊహించేలా చెప్పాలి ఉదాహరణకు నేలపై నీరు పోయడం పోసిన తర్వాత నేల జారుగా తయారవుతుంది. ఈ విధంగా రకరకాల పనులు చెబుతూ ఆ పని చేయడం ఏమి జరుగుతుందో పిల్లల ఊహించి చెప్పమనాలి ఈ విధంగా ఎవరైతే చక్కగా ఊహించి చెప్పారో వారిని Effect Finder గా గుర్తించి అభినందించాలి.
Readiness activity
Sandpaper Letter race
సాండ్ పేపర్ తో లెటర్స్ తయారు చేయాలి. పిల్లలకు లెటర్ చెప్పగానే వాళ్ళు తమ వేలుతో అక్షరాన్ని ట్రేస్ చేస్తూ గట్టిగా ఆ అక్షరాన్ని చెప్పాలి. ఈ విధంగా ఎవరైతే చక్కగా చేస్తున్నారో వారిని చప్పట్లతో అభినందించాలి.