మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

ఎపిఆర్‌జెసి, ఎపిఆర్‌డిసి నోటిఫికేషన్‌ విడుదల.దరఖాస్తుకు మే 20 ఆఖరు తేదీ

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆయా సంస్థలు నోటిఫికేషన్‌ విడుదల చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 10 జూనియర్‌ కాలేజీలు ఉనాుయి. వీటిలో బాలురుకు 4, బాలికలకు 2, కో ఎడ్యుకేషన్‌ 1, మైనారిటీ బాలురుకు 2, మైనారిటీ బాలికలకు1 చొప్పున కళాశాలలున్నాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఎపిఆర్‌జెసి పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష రాసేందుకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు 2022 ఏప్రిల్‌ 28 నుంచి స్వీకరిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు 2022 మే 20 ఆఖరు తేదీ. దరఖాస్తు చేసుకున్నవారు జూన్‌ 5న ప్రవేశ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు రాయాల్సి ఉంటుంది. పదోతరగతి ఆంధ్రప్రదేశ్‌లోనే చదువుకున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. జనరల్‌ కళాశాలల్లో సీట్ల రిజర్వేషన్‌ ఒసి-28, ఎస్‌సి-15, ఎస్‌టి-6, బిసి ఎ-7, బిసి బి-10, బిసి సి-1, బిసి డి-7, బిసి ఇ-4, ఇడబ్ల్యుఎస్‌-10, సిఎపి-3, స్పోర్ట్స్‌-3, వికలాంగులు-3, అనాథలు-3 శాతంగా ఉంటుంది.

సీట్ల వివరాలు

విజయనగరం, తాటిపూడిలోని ఎపిఆర్‌జెసి బాలురు కళాశాలలో ఎంపిసి-60, బైపిసి-40, ఎంఇసి-30 సీట్లు ఉన్నాయి. కృష్ణాజిల్లా, నిమ్మకూరులోని కో ఎడ్యుకేషన్‌ కాలేజీలో ఎంపిసి-50, బైపిసి-30, సిఇసి-30, ఎంఇసి-25, ఇఇటి-21, సిజిటి-21 సీట్లు ఉన్నాయి. పలాుడు జిల్లా నాగార్జునసాగర్‌లోని బాలురు కళాశాలలో ఎంపిసి-68, బైపిసి-51, సిఇసి-39, ఎంఇసి-42 సీట్లు ఉన్నాయి. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని బాలికల కళాశాలలో ఎంపిసి-60, బైపిసి-40, ఎంఇసి-30 సీట్లు ఉనాుయి. గుంటూరులోని ఉర్దూ బాలుర కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటిలో కోస్తాంధ్ర విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. కరూులులోని బాలుర ఉర్దూ కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటికి రాయలసీమ విద్యార్థులు అర్హులు. చిత్తూరు జిల్లాలోని, వాయలపాడు బాలికల ఉర్దూ కళాశాలలో ఎంపిసి-40, బైపిసి-40, సిఇసి-35 సీట్లు ఉన్నాయి. వీటికి కోస్తా, రాయలసీమకు చెందిన విద్యార్థులు అర్హులు.

దరఖాస్తు ఇలా..

ఎపిఆర్‌జెసి ప్రవేశపరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.250 ఆన్‌లైన్‌ పద్ధతిలో చెల్లించాలి. దరఖాస్తు చేసుకును వారికి ఐడి నెంబరు రాకుంటే ఆ దరఖాస్తుదారులకుఅర్హత లేనట్టే. వివరాలనీు ఆన్‌లైన్‌లో సమర్పించాలి. ఏమైనా తప్పుగా నమోదు చేస్తే సదరు దరఖాస్తులు తిరస్కరించబడతాయి. దరఖాస్తు చేసుకును వారికి మే 31 నుంచి హాల్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఇవ్వబడతాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించబడతాయి. ఏ జిల్లావారు ఏ కాలేజీకి దరఖాస్తు చేసుకోవచ్చో తెలుసుకునేందుకుపూర్తి వివరాలు కోసం https://aprs.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. సలహాలు, సందేహాల కోసం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల మధ్య 9100332106, 9676404618, 7093323253 నెంబర్లను సంప్రదించొచ్చు.

ఎపిఆర్‌డిసి సీట్లు ఇలా..

నాగార్జునసాగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో బిఎ, బికాం, బిఎస్‌సి కోర్సులకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో బిఎా40, బికాం (జనరల్‌)-40, బిఎస్‌సి ఎంపిసి (మేథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రి)-36, బిఎస్‌సి-ఎంపిసి (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌), బిఎస్‌సి-ఎంఇసి (మేథ్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌)కు కలిపి-36 మొత్తం 152 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. https://aprs.apcfss.in 

లో చూడవచ్చు.

LATEST POSTS

LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.0.8

లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.0.8 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చే...