తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో డిస్టెన్స్(దూర) విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఆ వర్సిటీలో చేరవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) హెచ్చరించింది. దూర విద్యకు సంబంధించి యూజీసీ నుంచి ఈ వర్సిటీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీ ప్రకటించే వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని కోరింది. ‘‘అన్నామలై వర్సిటీ ఓపెన్, డిస్టెన్స్ విధానంలో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రకటన జారీ చేసినట్టు తెలిసింది. కానీ, యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కాబట్టి ఈ వర్సిటీలో ఎవరూ చేరవద్దు’’ అని యూజీసీ సెక్రటరీ రజనీశ్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
LATEST POSTS
Rc.No.01/ACAD/MPTM/2025, Date: 28-06-2025 BIE, AP –Conduct of Mega Parent Teacher Meeting in all Government and Private Management Junior Colleges across the State on 10.07.2025 – Guidelines
రాష్ట్రవ్యాప్తంగా జూలై 10న మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని ఉత్తర్వులు విడుదల ఆరోజు చేయాల్సిన పూర్తి కార్యక్రమం వివరాలు Click Here t...