3మరియు 5 తరగతుల 15వ రోజు 16.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం.
తెలుగు
మూడు వాక్యాల కథను చదివించాలి. బొమ్మలతో కూడిన ఒక కథను చదవాలి ఉదాహరణకు చిలుక పండు తింటున్నది చిలక పాడింది పిల్లలు ఆనందించారు ఈ విధంగా ప్రతి వాక్యాన్ని బొమ్మతో చూపించి అర్థం చెప్పాలి పిల్లలందరిసే కథ శ్రద్ధగా వినేలా చేయాలి తర్వాత బొమ్మల కార్డులను పిల్లలకు ఇచ్చి కథాక్రమాన్ని అనుసరించి వాటిని వరుసగా అమర్చమనాలి.
ఆట:
కధా క్రమం పరుగు
కథ ఉన్నటువంటి బొమ్మల కార్డులను కలిపి ఇవ్వాలి విద్యార్థులు వాటిని సరైన క్రమంలో అమర్చేందుకు పోటీగా ప్రయత్నించాలి విద్యార్థుల చేత కథను సొంతమాటల్లో చెప్పమనాలి లేదా మూడు బొమ్మలు వేసే కథాక్రమాన్ని చూపించమనాలి.
ENGLISH
CVC Word writing :
పిల్లలకు CVC word ఉన్న picture చూపించాలి. అక్షరాలు విడిగా పలుకుతూ దానికి స్పెల్లింగ్ చెప్పాలి ఆ పదాన్ని బోర్డు పై రాయమనాలి. పిక్చర్ ను చూపించి వాట్ ఇస్ దిస్ అని అడగాలి పిల్లలు సరైన సమాధానం చెబుతూ దాని స్పెల్లింగ్ ను బోర్డుపై రాయాలి. ఈ విధంగా మూడు అక్షరాల పదాలను వ్రాయించాలి.
Word ladder game:
పిల్లలకు కొన్ని మూడు అక్షరాల పదాలు చెప్పమనాలి . అక్షరాల క్రమాన్ని మార్చి కొత్త పదాన్ని కొనగొనమనాలి . ఈ విధంగా పిల్లలు ఎవరైతే కొత్త పదాన్ని కనుగొంటారో వారిని చప్పట్లు తో అభినందించాలి .
Maths
Measurement weight :
పిల్లలకు గతంలో నేర్చుకున్నటువంటి లెక్కల టాపిక్స్ revise చేసుకోమని చెప్పాలి. వారికి patterns, tables లాంటి టాపిక్స్ ను వ్యక్తిగతంగా లేదా గ్రూప్ గా అసైన్ చేయాలి. వారికి ఫ్లాష్ కార్డులు డ్రాయింగ్స్ లేదా చిన్న డెమోలు తయారు చేసేలా సహకారం అందించాలి. ఈ విధంగా పిల్లలందరినీ మెటీరియల్ తయారు చేసుకోమనాలి . వారు తయారు చేసిన మెటీరియల్ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి ఎవరైతే చక్కగా వారికి Best explainer లేదా most fun teacher badge ఇచ్చి అభినందించాలి.