మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Vidyapravesh day 15 readiness activities for 1 and 2 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  15 వ రోజు   (16.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం

 తెలుగు 


కధ :  కథలో రోల్ ప్లే చేసి చూపమని పిల్లలకు చెప్పాలి 


ధ్వని ఆటలు :

 మొదటి ధ్వని ఏమిటి అని అడుగుతూ  రెండు అక్షరాల పదాలను పిల్లలను చెప్పమనాలి.


అక్షరాలతో ఆట:

 మొక్కతిప్పే ఆటను తెలుగు మరి ఇంగ్లీష్ అక్షరాలతో ఆడించాలి 


వ్రాయడం: 

 ఏదైనా బొమ్మ గీసి దాని గురించి  రాయమనాలి 


పాట-పద్యం:

 పిల్లల వంతుల వారిగా వారికి ఇష్టమైనటువంటి పాటలు  పాడించాలి 


 ENGLISH 


 Letter hunt in class:


 తరగతి గదిలో వివిధ మూలల్లో, షెల్ఫ్ లో,కుర్చీల కింద రకరకాల కాగితాలతో చేసిన అక్షరాలు ఉంచాలి. పిల్లలకు ఏదో ఒక అక్షరం చెప్పి ఆ అక్షరం గల కాగితం ఎక్కడ ఉందో వెతికి తీసుకు రమ్మనాలి. ఇలా పిల్లలందరి చేత ఆడించాలి. ఎవరైతే A నుండి Z వరకు గల అక్షరాలు అన్నింటిని కలెక్ట్ చేసి తీసుకువచ్చారో వారిని Alphabet explorer గా గుర్తించి అభినందించాలి  


object detective game:


 ఎవరైతే తెలివైన ప్రశ్నలు అడిగారు వారికి పాయింట్లు ఇవ్వాలి.  ఎవరైతే తక్కువ క్లూ లతో జవాబులు చెప్పారు వారిని ఆబ్జెక్ట్ డిటెక్టివ్ గా ఎంపిక చేసి చప్పట్లతో అభినందించాలి.

 

Maths 


Nature walk sorting:

 పిల్లలను nature walk కి తీసుకుని వెళ్లాలి. దారిలో ఆకులు రాళ్లు పువ్వులు మొదలైన వాటిని కలెక్ట్ చేసి వాటిని వాటి రంగు ఆకారం మరియు గుణం ఆధారంగా సపరేట్ చేయమని చెప్పాలి. ఎవరైతే త్వరగా ఎక్కువ వస్తువుల కలెక్ట్ చేశారో వారిని చప్పట్లతో అభినందించాలి.


Readiness activity


who is talking 


 తరగతులో ఉన్న పిల్లలందరికీ పిలిచి ఒక కుర్రవాడికి కళ్ళు మూయాలి మిగతా పిల్లలు ఎవరో ఒకరిని గుడ్ మార్నింగ్ లేదా హలో అని చెప్పమనాలి. ఎవరైతే ఆ మాట చెప్పారో వారిని గుర్తించమని ఈ పిల్లవాడితో చెప్పాలి. ఆ మాట్లాడిన వారిని సరిగ్గా గుర్తించిన వారిని అభినందించాలి. ఈ విధంగా పిల్లలందరి చేత చేయించాలి.

LATEST POSTS

Vidyapravesh day 15 readiness activities for 1 and 2 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  15 వ రోజు   (16.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం  తెలుగు  కధ :  కథలో రోల్ ప్లే చేసి చూపమని పిల్లలకు చెప...