తెలుగు
కధ : ఒక కథకు సంబంధించిన కృత్యాల నిర్వహించాలి ఆ కథను పిల్లలకు చెప్పాలి తర్వాత పిల్లల్లో ఒకరిని కథ మొత్తం చెప్పమని అడగాలి ఆ తర్వాత కథ గురించి ఎలా ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
రెండక్షరాల పదాల విడదీయడం నేర్పించాలి.
అక్షరాలతో ఆట:
తెలుగు మరియు ఇంగ్లీష్ అక్షరాలను విని రాయమని చెప్పాలి
వ్రాయడం:
టీచర్ చెప్పిన అక్షరం మీద ధ్వని రాయమని పిల్లలకు చెప్పాలి
పాట-పద్యం:
చిన్న పడవ పెద్ద పడవ పాటను పాడి వినిపించాలి.
ENGLISH
Alphabet puzzle game:
అక్షరాలను ఒక వరుసలో లేదా ఒక ఆకారంలో ఉంచి puzzle ను రూపొందించాలి. పిల్లలను ఆకారాలు మరియు వరుసలను గమనించాలని చెప్పాలి. ఆ అక్షరం ఎక్కడకు పోతుంది అని పిల్లలను అడగాలి. ఈ విధంగా పిల్లలను అడుగుతూ పజిల్ పూర్తి చేయించాలి. ఎవరైతే చక్కగా చెప్పారో వారిని చప్పట్లతో పజిల్ కింగ్/ క్వీన్ అని బిరుదు ఇచ్చి అభినందించాలి.
Maths
The missing piece:
పిల్లలకు కొన్ని జంతువులు లేదా వాహనాల చిత్రాలను చూపించి వాటిలో ఏ part మిస్ అయిందో చెప్పమనాలి. పిల్లలచే అలాగ మిస్ అయిన పార్ట్ ను చెప్పమనాలి . అదే విధంగా మిస్ అయిన part ను ఆ place లో గీయమని చెప్పాలి. ఎవరైతే సరిగ్గా గీసారో వారిని చప్పట్లతో అభినందించాలి.
Readiness activity
Echo game
పిల్లలతో lets go, I like Apples లాంటి sentence లు చెప్పాలి.
Loud, soft, excited, sleepy ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ తగిన శబ్దంతో చెప్పాలి. పిల్లవాడు కూడా అదే సౌండ్ ఉపయోగిస్తూ పదాలను చెప్పాలి. ఇలా ఎవరైతే రిదముగా చెబుతారో అటువంటి పిల్లలను అభినందించాలి.