మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

మ్యాపింగ్‌ వల్ల పాఠశాలలు మూతపడవు. విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొకదానికి వెళ్తారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

స్కూళ్ల మ్యాపింగ్‌పై ముగిసిన అవగాహన సదస్సులు

పాఠశాలలు మ్యాపింగ్‌ వల్ల పాఠశాలలు రద్దు కావడం, మూతపడటం జరగదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. విద్యార్థులు మాత్రమే ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్తారని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో భాగంగా చేపడుతున్న పాఠశాలల మ్యాపింగ్‌ కార్యక్రమంపై మూడు రోజులపాటు జరిగిన అవగాహన సదస్సులు శనివారం ముగిశాయి. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన చివరి రోజు సదస్సుకు అనంతపురం, చిత్తూరు, కర్నూలు, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ స్కూళ్ల మ్యాపింగ్‌ ద్వారా ఏదో జరిగిపోతోందని కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పాఠశాలలు రద్దు కావని.. ఇప్పుడున్నవి ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్, హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌గా రూపాంతరం చెందుతాయన్నారు. దీనిపై అవగాహన కల్పించడానికే మూడురోజులపాటు అన్ని జిల్లాల ప్రజాప్రతినిధులకు సదస్సులు నిర్వహించామని తెలిపారు. త్వరలోనే జిల్లాలవారీగా కూడా అధికారులు సదస్సులు నిర్వహిస్తారని చెప్పారు.

పాఠశాలల మ్యాపింగ్‌ తర్వాత ఎక్కడెక్కడ అదనపు తరగతి గదులు, ఇతర మౌలిక వసతులు అవసరమో గుర్తిస్తామని వివరించారు. నాడు–నేడు పథకం కింద పనులు పూర్తి చేస్తామన్నారు. మన రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతోపాటు వారి ఆరోగ్య భద్రత కూడా చూసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా మాట్లాడుతూ.. ఉర్దూ పాఠశాలల మ్యాపింగ్‌ సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ముందుకు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కమిషనర్‌ సురేష్‌ కుమార్, ఎస్పీడి వెట్రిసెల్వి, మౌలిక వసతుల సలహాదారు మురళి, తదితరులు పాల్గొన్నారు.

చర్చల ద్వారానే సమస్య పరిష్కారం

ఏ సమస్యకైనా చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ విషయంలో ఉద్యోగులు ప్రభుత్వంతో చర్చలకు రాకుండా ఉండటం సరికాదన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదని చెప్పారు. జీవో కాపీలు తగులబెట్టడం, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం సరికాదన్నారు. 

ఎప్పటికైనా సమస్యను పరిష్కరించాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఒకసారి చర్చలకు వెళ్లి సంప్రదింపులు జరిపాక ఇప్పుడు వెనక్కి తగ్గటమేమిటని ప్రశ్నించారు. ఉన్న ఇబ్బందులను మళ్లీ చర్చల ద్వారా తెలియజేయొచ్చన్నారు.  

All Telugu and English News Papers and News Channels

అన్ని ప్రధాన దినపత్రికలు (తెలుగు మరియు  ఇంగ్లీష్ ) ఓకే చోట పోందుపరచడం జరిగింది. మీకు కావలసిన పత్రిక పైన క్లిక్ చేసి వార్తలు చదువుకోవచ్చు. 

How to download PRADHANA MANTRI SURAKSHA BHIMA YOJANA( PMSBY ) Policy Certificate in Telugu.

 ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ సర్టిఫికెట్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఏ డేటా అవసరం , పాలసీ వలన మనకు కలిగే లాభం ఏమిటి వంటి పూర్తి సమాచారం

క్రింది వెబ్ సైట్ పై క్లిక్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ తో మీ పాలసీ సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోగలరు.

https://nationalinsurance.nic.co.in/en/about-us/pradhan-mantri-suraksha-bima-yojana

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన యొక్క అర్హత ప్రమాణాలు:

 ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కోసం సబ్‌స్క్రయిబ్ చేయడానికి అర్హత ప్రమాణాలు క్రింది విధంగా ఉన్నాయి:

 కనీస వయస్సు అవసరం 18 సంవత్సరాలు.

 గరిష్ట వయస్సు అవసరం 70 సంవత్సరాలు.

 సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉన్నవారు మరియు 18 - 70 ఏళ్లలోపు వారు పాలసీకి సభ్యత్వం పొందేందుకు అర్హులు.

 బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలి.

 బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుతో లింక్ చేయకపోతే, దరఖాస్తు ఫారమ్‌తో ఆధార్ కార్డు కాపీని జతచేయాలి.

 వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉంటే, అతను లేదా ఆమె ఒకే బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే పథకంలో చేరడానికి అర్హులు.

 చెల్లించాల్సిన ప్రీమియం సంవత్సరానికి రూ. 12.

 బీమా చేసినవారి బ్యాంక్ ఖాతా నుండి ప్రీమియం మొత్తం ఆటోమేటిక్‌గా డెబిట్ చేయబడుతుంది.

 పథకం ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది మరియు సంవత్సరం చివరిలో దీనిని పునరుద్ధరించవచ్చు.

 ప్రాథమిక KYC పత్రం దరఖాస్తుదారు యొక్క ఆధార్ కార్డ్.

ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పాలసీ సర్టిఫికెట్ ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, సర్టిఫికెట్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి ఏ డేటా అవసరం , పాలసీ వలన మనకు కలిగే లాభం ఏమిటి వంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరించడం జరిగింది .

https://youtu.be/bKf6irlPuD0


Ap COVID latest bulletin for Daily cases


28-1-2022 నాడు రాష్ట్ర లో కరోనా కేసులు అప్డేట్ జిల్లాలు వారీగా గడచిన 24 గంటల్లో
మొత్తం పాజిటివ్ కోసులు ::: 12561

కోలుకున్న వారు 8742

Gross amount difference between old PRC and new PRC with new HRA Slabs and old HRA slabs

కొత్త పి ఆర్ సి ప్రకారం ఉద్యోగులకు GROSS ఏవిధంగా తగ్గుతుంది, జీతం ఎంత? పాత పి ఆర్ సి ప్రకారం GROSS జీతం ఎంత? జనవరి కొత్త జీతం పాత జీతం ప్రకారం ఎవరికి ఎంత తగ్గుతుంది, ఎలా తగ్గుతుంది, సిపిఎస్ ఉద్యోగులకు ఎంత నష్టం వంటి పూర్తి వివరాలతో వీడియో రూపొందించడం జరిగింది.

మీ గ్రాస్ అమౌంట్ ను మీరే లెక్క పెట్టుకోవడానికి సాఫ్ట్వేర్ను తయారు చేయడం జరిగింది

Click Here to Download PRC software Gross calculation

https://youtu.be/sJAA61v03qg

LATEST POSTS

Numbers, Alphabet and Varnamala Letters Drawing

తెలుగు వర్ణమాల, ALPJABET, 0 TO 9 నెంబర్స్ తో ఒక్కొక్క లెటర్ డిస్ప్లే అవుతుంది. పిల్లలు ఆ అక్షరంపై వారి యొక్క వేలుతో రాసే విధంగా ప్రోగ్రాం ను...