లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.1.7 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చేసుకోగలరు. ఈ క్రింది లింకు ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.
Day 12 readiness program activities for 3 and 5 classes
Vidyapravesh day 12 readiness activities for 1 and 2 classes
విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 12వ రోజు (11.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : ఒక కథకు సంబంధించిన కృత్యాలను నిర్వహించాలి. తర్వాత కథను చెప్పమని పిల్లలకు చెప్పాలి తర్వాత పిల్లలను కథను సొంతమాటల్లో చెప్పమని అడగాలి తర్వాత కథ గురించి ఎలా ఎందుకు వంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
మొదటి ధ్వని ఏమిటి అని అడుగుతూ రెండు అక్షరాల పదాలను పిల్లలను చెప్పమనాలి.
అక్షరాలతో ఆట:
ఉపాధ్యాయుడు ఏదో ఒక అక్షరం చెప్పాలి విద్యార్థులను ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు చెప్పమనాలి
వ్రాయడం:
ఉపాధ్యాయుడు చెప్పిన ప్రధాన విని పిల్లలు వ్రాయాలి
పాట-పద్యం:
"ఆటలు ఆడి పాటలు పాడి అలసివచ్చెనే" అనే పాటను మరికొంతమంది పిల్లలచే పాడించాలి
ENGLISH
Animal sound game :
పిల్లలకు వివిధ జంతువులు చేసే శబ్దాలను వినిపించి అది ఏ జంతువుదో చెప్పమనాలి. అలాగే ఆ జంతువు గురించి రెండు వాక్యాలు చెప్పమనాలి.
Sound safari game:
ఎవరైతే జంతువు శబ్దాన్ని కరెక్ట్ గా చెప్పారు వారికి ఒక మార్కు ఇవ్వాలి అలాగే ఆ జంతువు గురించి రెండు వాక్యాలు చెప్పిన వారికి బోనస్ గా మరొక మార్కు ఇవ్వాలి. ఇలా ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారిని చప్పట్లతో అభినందించాలి.
Maths
Picture sequencing :
ఏదైనా ఒక కథకు సంబంధించి మూడు లేదా నాలుగు పిక్చర్స్ చూపించాలి. వాటిలో ఏ పిక్చర్ మొదట వస్తుంది తర్వాత ఏది వస్తుంది అనే వరుసక్రమాన్ని పిల్లలను పెట్టమనాలి. అప్పుడు కథలు వరుసగా చెప్పమనాలి. ఎవరైతే ఆ పిక్చర్స్ను సరైన క్రమంలో అమర్చారు వారికి sequence star బ్యాడ్జి ఇచ్చి అభినందించాలి
Readiness activity
Sound hunt
ఉపాధ్యాయుడు పేపర్ నలిపినశబ్దం, పెన్సిల్ బాక్స్శబ్దం, బొమ్మ, గంట మొదలైన వాటి శబ్దాన్ని పిల్లలకు వినిపించాలి. తరగతి గదిలో వాటి శబ్దాన్ని చేస్తూ పిల్లలను అది ఏ శబ్దమో చెప్పమనాలి. అలా ఎవరైతే సరైన శబ్దాన్ని చెప్పారో వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.
Day 9 readiness program activities for 3 and 5 classes
3 మరియు 5 తరగతుల 9వ రోజు 07.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం.
తెలుగు
మూడు అక్షరాల పదాలను చదవడం మరియు రాయడం చెప్పాలి.
టీచర్ బోర్డుపై మూడు అక్షరాల పదాలను రాసి స్పష్టంగా చదవాలి. ప్రతి పదాన్ని పలకడం మరియు అర్థం చెప్పడం చేయాలి. విద్యార్థులు టీచర్ చెప్పిన గుణింతాల నుండి ఎంచుకొని వాటితో ఐదు గుణింత అక్షరాలు వర్క్ బుక్ లో రాయడం ప్రాక్టీస్ చేయాలి.
ఆట:
పదాల రైలు :
ప్రతి విద్యార్థికి ఒక అక్షర కార్డు ఇవ్వాలి.టీచర్ ఒక పదం చెప్పాలి ఆ పదానికి సంబంధించిన అక్షరాలను విద్యార్థులు వరుసగా నిలబడి పదా రైలుగా మారతారు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు పదనిర్మాణం పై అవగాహన పెరుగుతుంది.
విద్యార్థులు శబ్దాన్ని విని దానికి సరిపోయే గుణింత అక్షరాన్ని గుర్తించగలగాలి శబ్ద, గుణింత అక్షరం జతచేయడాన్ని బట్టి టీచర్ మూల్యాంకనం చేయాలి.
ENGLISH
Sentence writing :
This is my father......
ఇలా పిల్లలతో సింపుల్ గా ఉండే సెంటెన్స్ లు చెప్పించాలి. పదాలను విడివిడిగా రాయడం నేర్పించాలి వాటిని గట్టిగా చదవమని చెప్పాలి. పిల్లలను వారి ఫ్యామిలీ నేమ్స్ ఉపయోగిస్తూ రెండు సెంటెన్స్ లు రాయమని చెప్పాలి. ఇలా ఎవరైతే చక్కగా రాశారో వారిని చప్పట్లు తో అభినందింప చేయాలి.
Maths
Counting in groups:
2s, 5s, 10 s ఎలా ఉపయోగిస్తూ స్కిప్ కౌంటింగ్ పిల్లలకు వేగంగా చేయడం నేర్పించాలి. షూస్ జతలను లెక్కపెడుతూ అలాగే చేతివేళ్ళను లెక్కపెడుతూ అలాగే పెన్సిల్ కట్టమని లెక్కపెడుతూ పిల్లలకు అలవాటు చేయించాలి.
చాక్లెట్స్ బ్లాక్ ఉపయోగిస్తూ ఇటువంటి ఆక్టివిటీ చేయించాలి. పిల్లలను వ్యక్తిగతంగాను గ్రూపుల గాను ఈ యొక్క యాక్టివిటీ చేయించాలి. Group it fast apus చాలెంజ్ పెట్టి ఎవరైతే వేగంగా ఇస్కిప్ కౌంటింగ్ చేస్తారో వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.
Vidyapravesh day 9 readiness activities for 1 and 2 classes
విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 9వ రోజు (07.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా? ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
కథలోని పదాలలో ఎన్ని 2 అక్షరాల ధ్వనులు ఉన్నాయి చెప్పమనాలి.
అక్షరాలతో ఆట:
నేను చెప్తాను మీరు చేయండి అంటూ పిల్లలకు కొన్ని అక్షరాలు చెప్పి రాయించాలి.
వ్రాయడం:
వర్క్ షీట్స్ ఇచ్చి రంగులు వేయమని చెప్పాలి.
పాట-పద్యం:
తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అనే పాటని పిల్లలతో పాడించాలి.
ENGLISH
Roleplay corner :
మనము ఏదైనా ఒక హాస్పిటల్లో లేదా మార్కెట్లో ఉన్నట్లుగా భావించమని పిల్లలకు చెప్పాలి. ఒక పిల్లవాడిని డాక్టర్ గా నటించమని చెప్పి మిగతా వారిని పేషెంట్స్ గా నటించమని చెప్పి వారి చేత మాట్లాడించాలి. అలాగే ఒక షాప్ కీపర్ గాను మిగతా వారిని కస్టమర్స్ గాను నటించమని మాట్లాడించాలి. ఈ విధంగా పిల్లలచే రోల్ ప్లే చేయించాలి.
ఎవరైతే చక్కగా మాట్లాడారో వాళ్లని Rolestar గా గుర్తించి వారిని పిల్లలతో చప్పట్లుచే అభినందింప చేయాలి
Maths
Sorting by size :
వివిధ సైజు లలో గల వస్తువులను సేకరించాలి. వాటిని పిల్లలకు చూపించి వారికి smallest, biggest భావనలను నేర్పించాలి. ఒక్కొక్క పేద వాడిని పిలిచి ఏది big ఏది small అంటూ అడగాలి. చక్కగా చెప్పిన వారికి size sorter మెడల్ ఇచ్చి అభినందింప చేయాలి.
Readiness activity
Traffic light game:
Red, Yellow, Green రంగుల ఫ్లాష్ కార్డులను ఉపయోగించాలి. Red కార్డు చూపిస్తే stop అని చెప్పాలి. Yellow కార్డు చూపిస్తే get ready అని చెప్పాలి. Green కార్డు చూపిస్తే Go అని చెప్పాలి. ఈ విధంగా పిల్లలతో ప్లాస్టర్ తెలిసే ఆక్టివిటీ చేయించాలి.
. బాగా చెప్పిన వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.
Day 8 readiness program activities for 3 and 5 classes
3 మరియు 5 తరగతుల 8వ రోజు 05.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
గుణింతాల తో పదం నిర్మాణం :
టీచర్ బోర్డుపై గుణింతాలు తో ఏర్పడే పదాలను రాయాలి. ఇలా ప్రతిపదాన్ని రాసి చదివిస్తూ దాని అర్ధాన్ని వివరంగా చెప్పాలి.పదానికి అనుగుణంగా బొమ్మ చూపించాలి. అప్పుడు విద్యార్థులు టీచర్స్ అడిగిన పదాన్ని మరలా గట్టిగా చదవాలి.ఆ పదాన్ని సంబంధిత బొమ్మతో జతపరచాలి.
ఆట:
పదాల బుట్ట :
రెండు బుట్టలు తీసుకొని ఒక దానిలో పదాల కార్డులు మరొక బట్టలు బొమ్మల కార్డులు ఉంచాలి. విద్యార్థులు ఒక పదాన్ని ఎంచుకొని దానికి సరిపడే బొమ్మను ఇంకొక బుట్టలోంచి ఎంచుకుని జత చేయాలి. సరైన జత చేసినటువంటి విద్యార్థులను ప్రోత్సాహంగా చప్పట్లు కొట్టించి లేదా మంచి బహుమతి ఇచ్చి అభినందించాలి.
విద్యార్థులు సరైన పదాన్ని చదివి ఇచ్చిన మూడు పదాలు నుంచి సరైన పదానికి సున్నా చుట్టాలి. శబ్దం, చిహ్నం, అర్థం మధ్య సంబంధాలు గుర్తించగలగాలి.
ENGLISH
My family :
పిల్లలకు father, mother, sister, brother, baby మొదలైన పదాలను పరిచయం చేయాలి. This is my father అంటూ ఫాదర్ బొమ్మ ఉన్న పిక్చర్ గా చూపించండి అలాగే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా this is my mother..... అని చెప్తూ చూపించమనాలి.
ఫ్యామిలీ గురించి ఒక చిన్న కథ చెప్పాలి. ఒక చిన్న ఫ్యామిలీ ఫోటోను గీయమనాలి. ఫ్యామిలీ ట్రీ కూడా గీయమనాలి.
Game:
Family flash match:
పిల్లలకు ఫ్యామిలీ మెంబర్స్ గల పిక్చర్ కార్డులు మరియు వర్డ్స్ కార్డులు ఇవ్వాలి.
వాటిని వేరువేరు గ్రూపులుగా విభజించి పిల్లలను జతపరచమని చెప్పాలి. ఎవరైతే సరిగ్గా జతపరిచారో వారిని అభినందించాలి.
Maths
Comparing numbers :
Less than (<) , greater than (>) , is equal to (= ) మొదలైన గుర్తులను పరిచయం చేయాలి. ఆ గుర్తులను ఏ విధంగా వినియోగించాలో పిల్లలకి అర్థం అయ్యేలా చెప్పాలి. వివిధ అంకెల జఫలము లాస్ట్ కార్డులపై లేదా బోర్డుపై రాసి చూపించాలి. ఆ అంకెల మధ్య సరైన గుర్తు ఉపయోగించమని చెప్పాలి. పెద్ద సంఖ్య చిన్న సంఖ్య వాటిని గుర్తించి సున్నాలు చుట్టమని చెప్పాలి. ఎవరైతే చక్కగా చేశారో వారిని పిల్లలందరితో చప్పట్లు కొట్టించి అభినందించాలి.
Vidyapravesh day 8 readiness activities for 1 and 2 classes
విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 8వ రోజు (05.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా? ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
కథలోని పదాలలో ఎన్ని పనులు ఉన్నాయి చెప్పమనాలి
అక్షరాలతో ఆట:
పిల్లలకు ఇప్పటివరకు నేర్పించిన అక్షరాలు వెతికించే ఆట ఆడించాలి.
వ్రాయడం:
నేను చెప్తాను మీరు చేయండి అంటూ పిల్లలకు కొన్ని అక్షరాలు చెప్పి రాయించాలి.
పాట-పద్యం:
తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అనే పాటని పాడి వినిపించి ఆ తరువాత కొంతమంది పిల్లలతో పాడించాలి.
ENGLISH
Who am I ? :
ఏవైనా కొన్ని జంతువులు లేదా వస్తువుల గురించి పిల్లలకు వివరించి వాళ్ళు జాగ్రత్తగా వినేలా చేయాలి. తర్వాత టీచర్ ఆ పిల్లలను ఈ వస్తువు లేదా జంతువును గురించి రెండు లేదా మూడు clues ఇస్తూ Who am I ? అని అడగాలి. ఇలా విద్యార్థులందరినీ అడగాలి.
ఎవరైతే చక్కగా జవాబులు చెప్పగలుగుతారో వారిని రriddle champion గా గుర్తించి అభినందించాలి.
Maths
Spot the difference :
ఓకే రకంగా ఉండే రెండు పిక్చర్స్ ను తీసుకోవాలి. వాటిలో గల తేడాను ఒకదాన్ని వివరించాలి. మిగతా తేడాలను గుర్తించమని పిల్లల్ని అడగాలి. ఆ గుర్తించిన తేడాలను గట్టిగా చెప్పమనాలి. అలా చెప్పిన పిల్లలను difference detective గా ప్రకటించి
చప్పట్లతో అభినందింప చేయాలి.
Readiness activity
Flash light hide seek game:
తరగతులు ఉన్నటువంటి అన్ని వస్తువులను గమనించమని పిల్లలతో చెప్పాలి. తరువాత తరగతి గదిని వీలైనంత తక్కువ వెలుతురు ఉండేలా చేయాలి. ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని తరగతుల వివిధ వస్తువులపై వేయాలి. ఎవరైతే ఆ వస్తువు పేరు సరిగ్గా చెప్పారో వారిని అభినందించాలి. ఇలా తరగతుల గల విద్యార్థులు అందరి చేత ఆడించాలి. బాగా చెప్పిన వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.
LATEST POSTS
LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.1.7
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.1.7 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చే...