ఓపెన్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇలా
రాష్ట్రంలో ఓపెన్ విధానంలో (ప్రైవేట్ లేదా డిస్టెన్స్) పదో తరగతి, ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల పరీక్షలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ ఈ నెల ఏడో తేదీన ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పది, ఇంటర్ విద్యార్థులకు మే రెండో తేదీ నుంచి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే రెగ్యులర్ పరీక్షల షెడ్యూల్లో మార్పు చేయడం, ప్రైవేట్ విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సార్వత్రిక విద్యాపీఠం పరీక్షల షెడ్యూల్ను సవరించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం పదో తరగతి ఓపెన్ విద్యార్ధులకు ఏప్రిల్ 27 నుంచి మే ఏడో తేదీ నుంచి ఓపెన్ ఇంటర్ పరీక్షలు జరుగుతాయి.
పది విద్యార్థులకు
ఏప్రిల్ 27న 205 - తెలుగు, 206 ఉర్దూ, 208 - కన్నడ, 233 - ఒరియా, 237 తమిళం పరీక్షలు, 28న 202- ఇంగ్లీష్ 29న 211 - గణితము, 223 -భారతీయ సంస్కృతి, వారసత్వం పరీక్షలు, మే రెండో తేదీన 212 - శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం, 216- గృహ విజ్ఞాన శాస్త్రము, 4న 213 - సాంఘిక శాస్త్రము, 214 - ఆర్థిక శాస్త్రము, ఐదో తేదీన 201 - హిందీ, ఆరున 215 బిజినెస్ స్టడీస్, 222 - మనో విజ్ఞాన శాస్త్రం, అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి.
ఇంటర్మీడియట్ విద్యార్థులకు
మే ఏదో తేదీన 301 - హిందీ, 305 - తెలుగు, 306 - ఉర్దూ. మే 10న 302 ఇంగ్లీష్, 12న 311- గణితము, 315- చరిత్ర, 320 వ్యాపార గణక శాస్త్రము, 14 తేదీన 312 - భౌతిక శాస్త్రము, 317 - రాజనీతి శాస్త్రము, పౌర శాస్త్రము, 328 - మనో విజ్ఞాన శాస్త్రము, 17న 313 - రసాయన శాస్త్రం, 318 - ఆర్థికశాస్త్రము, 331-సామాజికశాస్త్రము, 19న 314-జీవ శాస్త్రము. 319- వాణిజ్య, వ్యాపార శాస్త్రము, 321 గృహవిజ్ఞాన శాస్త్రం, 21న అన్ని వృత్తి విద్యా సబ్జెక్టులకు పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ జనరల్, వృత్తి విద్యా కోర్సులకు ప్రాక్టికల్ పబ్లిక్ పరీక్షలు, మే 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయని సార్వత్రిక విద్యాపీఠం డైరక్టర్ డా. కేవీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.