జూన్ లో టెట్. విద్యాశాఖ కసరత్తు. 2018 తర్వాత మళ్లీ ఇప్పుడే
రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) నిర్వహణకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏటా టెటు నిర్వహించాల్సి ఉండగా.. రాష్ట్రంలో 2018 తర్వాత ఇప్పటి వరకు నిర్వహించలేదు. దీంతో బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు ఐదేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. గతేడాది జూన్లో విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ టెట్ రివైజ్డ్ సిలబసు ప్రకటించడంతో వారిలో ఆశలు చిగురించాయి. అయితే వివిధ కారణాల వల్ల గతేడాది కూడా పరీక్షలు జరగలేదు. దీంతో ప్రభుత్వం ఈ ఏడాదిటెట్ నిర్వహించాలని యోచిస్తోంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వేలాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఏటా డీఎస్సీ వేస్తామని ప్రభుత్వం ఏర్పా టుకు ముందే ప్రకటించింది. కానీ 2019 నుంచి ఒక్క డీఎస్సీ నీ ప్రకటించకపోవడంతో.. కనీసం టెట్ అయినా నిర్వహిస్తే ఆ తర్వాత డీఎస్సీకి అవకాశాలు ఉంటాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే 2019, 20లో జన వరిలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం గతేడాది జూ న్లో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా జూన్ లోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని, అందులో ఉపా ధ్యాయ పోస్టుల భర్తీ కూడా ఉంటుందని భావిస్తు న్నారు. ఈ దిశగానే విద్యాశాఖ జూన్లో టెట్ నిర్వహిం చేందుకు కసరత్తు చేస్తోంది.
ఒక్కసారి అర్హత సాధిస్తే చాలు
పాఠశాల విద్యాబోధనలో ప్రమాణాలు మెరుగుపరిచేం దుకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎస్సీటీఈ) టీ చర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్)ను ప్రతిపాదించింది. ఈ నేప థ్యంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు'టెట్'ను నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో టె ట్లో అర్హత సాధించిన వారికి ఏడేళ్ల గుర్తింపు ఉండేది. అయి తే సవరించిన నిబంధనల మేరకు ఒక్కసారి అర్హత సాధిస్తే జీవితకాలం వ్యాలిడిటీ ఉంటుంది. ఏపీ టెట్కు సంబంధిం చి.. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు బోధించేందు కు(ఎస్ఓటీ) పేపర్-1ఏ. ఆరో తరగతి నుంచి 8వ తరగతి వ రకు బోధించేవారు (స్కూల్ అసిస్టెంట్ పేపర్-2ఏ రాయా ల్సి ఉంటుంది.
నియామకాల్లో వెయిటేజీ
ప్రభుత్వ జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే అభ్యర్థులుడీఎస్సీ రాయాల్సి ఉంటుంది. అంతకు ముందు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనల మేర కు టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. అలాగే టెట్లో ఉత్తీర్ణత సాధించినవారికి ఉపాధ్యాయ నియామక పోస్టుల్లో 20 శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్ రాసేందుకు పేపరు బట్టి ఇంటర్మీడియెట్, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీతోపాటు డీఈడీ, బీపీఈడీ తత్సమాన కోర్సులు చదివి ఉండాలి. పూర్తి ఆన్లైన్ విధానంలో 150 మార్కులకు రెండున్నర గంటల పాటు నిర్వహించే ఏపీ టెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటా యి. 1-5 తరగతుల టీచర్ పోస్టులకు పోటీ పడేవారు పేపర్ 1ఏకు; 6-8 తరగతుల టీచర్ పోస్టులకు పోటీ పడేవారు పేపర్ 2ఏకు హాజరవ్వాల్సి ఉంటుంది. ఆయా పోస్టులకు పే ర్కొన్న అర్హతలు కలిగిన వారు రెండు పేపర్లకూ హాజర వ్వొ చ్చు. టెట్ ప్రశ్నపత్రం మల్టిపుల్ ఛాయిస్ విధానంలో ఉంటు ంది. టెట్ జనరల్ అభ్యర్థులు (ఓసీలు) కనీసం 60 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, ఎక్స్ సర్వీసెమెన్ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు పొందితేనే.. అర్హత సాధించినట్లు అవుతుంది.