మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

Vidyapravesh day 15 readiness activities for 1 and 2 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  15 వ రోజు   (16.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం

 తెలుగు 


కధ :  కథలో రోల్ ప్లే చేసి చూపమని పిల్లలకు చెప్పాలి 


ధ్వని ఆటలు :

 మొదటి ధ్వని ఏమిటి అని అడుగుతూ  రెండు అక్షరాల పదాలను పిల్లలను చెప్పమనాలి.


అక్షరాలతో ఆట:

 మొక్కతిప్పే ఆటను తెలుగు మరి ఇంగ్లీష్ అక్షరాలతో ఆడించాలి 


వ్రాయడం: 

 ఏదైనా బొమ్మ గీసి దాని గురించి  రాయమనాలి 


పాట-పద్యం:

 పిల్లల వంతుల వారిగా వారికి ఇష్టమైనటువంటి పాటలు  పాడించాలి 


 ENGLISH 


 Letter hunt in class:


 తరగతి గదిలో వివిధ మూలల్లో, షెల్ఫ్ లో,కుర్చీల కింద రకరకాల కాగితాలతో చేసిన అక్షరాలు ఉంచాలి. పిల్లలకు ఏదో ఒక అక్షరం చెప్పి ఆ అక్షరం గల కాగితం ఎక్కడ ఉందో వెతికి తీసుకు రమ్మనాలి. ఇలా పిల్లలందరి చేత ఆడించాలి. ఎవరైతే A నుండి Z వరకు గల అక్షరాలు అన్నింటిని కలెక్ట్ చేసి తీసుకువచ్చారో వారిని Alphabet explorer గా గుర్తించి అభినందించాలి  


object detective game:


 ఎవరైతే తెలివైన ప్రశ్నలు అడిగారు వారికి పాయింట్లు ఇవ్వాలి.  ఎవరైతే తక్కువ క్లూ లతో జవాబులు చెప్పారు వారిని ఆబ్జెక్ట్ డిటెక్టివ్ గా ఎంపిక చేసి చప్పట్లతో అభినందించాలి.

 

Maths 


Nature walk sorting:

 పిల్లలను nature walk కి తీసుకుని వెళ్లాలి. దారిలో ఆకులు రాళ్లు పువ్వులు మొదలైన వాటిని కలెక్ట్ చేసి వాటిని వాటి రంగు ఆకారం మరియు గుణం ఆధారంగా సపరేట్ చేయమని చెప్పాలి. ఎవరైతే త్వరగా ఎక్కువ వస్తువుల కలెక్ట్ చేశారో వారిని చప్పట్లతో అభినందించాలి.


Readiness activity


who is talking 


 తరగతులో ఉన్న పిల్లలందరికీ పిలిచి ఒక కుర్రవాడికి కళ్ళు మూయాలి మిగతా పిల్లలు ఎవరో ఒకరిని గుడ్ మార్నింగ్ లేదా హలో అని చెప్పమనాలి. ఎవరైతే ఆ మాట చెప్పారో వారిని గుర్తించమని ఈ పిల్లవాడితో చెప్పాలి. ఆ మాట్లాడిన వారిని సరిగ్గా గుర్తించిన వారిని అభినందించాలి. ఈ విధంగా పిల్లలందరి చేత చేయించాలి.

Day 15 readiness program activities for 3 and 5 classes

3మరియు 5 తరగతుల  15వ రోజు  16.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం.

తెలుగు 

 మూడు వాక్యాల కథను చదివించాలి. బొమ్మలతో కూడిన ఒక కథను చదవాలి ఉదాహరణకు చిలుక పండు తింటున్నది చిలక పాడింది పిల్లలు ఆనందించారు ఈ విధంగా ప్రతి వాక్యాన్ని బొమ్మతో చూపించి అర్థం చెప్పాలి పిల్లలందరిసే కథ శ్రద్ధగా వినేలా చేయాలి తర్వాత బొమ్మల కార్డులను పిల్లలకు ఇచ్చి కథాక్రమాన్ని అనుసరించి వాటిని వరుసగా అమర్చమనాలి.


ఆట:

 కధా క్రమం పరుగు 

 కథ ఉన్నటువంటి బొమ్మల కార్డులను కలిపి ఇవ్వాలి విద్యార్థులు వాటిని సరైన క్రమంలో అమర్చేందుకు పోటీగా ప్రయత్నించాలి విద్యార్థుల చేత కథను సొంతమాటల్లో చెప్పమనాలి లేదా మూడు బొమ్మలు వేసే కథాక్రమాన్ని చూపించమనాలి.


ENGLISH 


 CVC Word writing :

 పిల్లలకు CVC word ఉన్న picture చూపించాలి. అక్షరాలు విడిగా పలుకుతూ దానికి స్పెల్లింగ్ చెప్పాలి ఆ పదాన్ని బోర్డు పై రాయమనాలి. పిక్చర్ ను చూపించి వాట్ ఇస్ దిస్ అని అడగాలి పిల్లలు సరైన సమాధానం చెబుతూ దాని స్పెల్లింగ్ ను బోర్డుపై రాయాలి. ఈ విధంగా మూడు అక్షరాల పదాలను వ్రాయించాలి.


Word ladder game:


 పిల్లలకు కొన్ని మూడు అక్షరాల పదాలు చెప్పమనాలి . అక్షరాల క్రమాన్ని మార్చి కొత్త పదాన్ని కొనగొనమనాలి . ఈ విధంగా  పిల్లలు ఎవరైతే కొత్త పదాన్ని కనుగొంటారో వారిని చప్పట్లు తో అభినందించాలి .


Maths 

Measurement weight :

 పిల్లలకు గతంలో నేర్చుకున్నటువంటి లెక్కల టాపిక్స్ revise చేసుకోమని చెప్పాలి. వారికి patterns, tables లాంటి టాపిక్స్ ను వ్యక్తిగతంగా లేదా గ్రూప్ గా అసైన్ చేయాలి. వారికి ఫ్లాష్ కార్డులు డ్రాయింగ్స్ లేదా చిన్న డెమోలు తయారు చేసేలా సహకారం అందించాలి. ఈ విధంగా పిల్లలందరినీ మెటీరియల్ తయారు చేసుకోమనాలి . వారు తయారు చేసిన మెటీరియల్ గురించి కొన్ని ప్రశ్నలు అడగాలి ఎవరైతే చక్కగా వారికి  Best explainer లేదా most fun teacher badge ఇచ్చి అభినందించాలి.

LEAP (Learning Excellence in Andhra Pradesh) app latest version 3.1.7

లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ LEAP APP లేటెస్ట్ వెర్షన్ 3.1.7 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ను క్లిక్ చేసి యాప్ ను అప్డేట్ చేసుకోగలరు. ఈ క్రింది లింకు ద్వారా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

Click Here to Download LEAP APP

Day 12 readiness program activities for 3 and 5 classes

3 మరియు 5 తరగతుల  12వ రోజు  011.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం.

తెలుగు
 పాప పాఠశాలకు వెళ్లింది లాంటి సరళమైన వాక్యాలు చెప్పాలి. బొమ్మను చూపించి దానికి సంబంధించిన వాక్యాన్ని శబ్ద పూర్వకంగా రూపొందించాలి బోర్డు మీద రాయడం ద్వారా పిల్లలకి స్పష్టత కలిగించాలి. బొమ్మను పరిశీలించి దానికి తగిన వాక్యాన్ని తయారు చేయమని పిల్లలతో చెప్పాలి అలాంటి మరొక సరళ వాక్యాన్ని స్వయంగా చెప్పమని లేదా రాయమని చెప్పాలి.

వాక్య పజిల్:

 ఒక వాక్యాన్ని పదాలుగా కట్ చేసి వేరువేరుగా ముద్రించాలి విద్యార్థులను వాటిని సరైన క్రమంలో అమర్చి అర్థవంతమైన వాక్యంగా చేయమని చెప్పాలి.

ENGLISH

 Action and fun- verbs:

Jump, clap, sit లాంటి యాక్షన్ పదాలను పిల్లలకు పరిచయం చేయాలి. వాటి అర్ధాన్ని పిల్లలకు చెప్పి వాటి పట్ల అవగాహన కల్పించాలి. ఆ యాక్షన్ పదాలను చెప్పి ఆ పదానికి సంబంధించిన యాక్షన్  ఉపాధ్యాయుడు చేయాలి. అదేవిధంగా పిల్లలతో చేయించాలి . ఎవరైతే సరిగ్గా చేశారో వారిని చప్పట్లతో అభినందించాలి.


Maths

 Shapes around us :

Circle, rectangle, triangle, square వంటి ఆకారాలను పిల్లలకు పరిచయం చేయాలి. ఆ ఆకారాలు గల  వస్తువులు తరగతిగదిలో ఏమి ఉన్నాయో పిల్లలను చెప్పమనాలి. అదేవిధంగా వారి ఇంటిలో ఆ ఆకారాలు గల వస్తువులు ఏమేమి ఉన్నాయో పిల్లల చేత చెప్పించాలి. వివిధ ఆకారాల్లో గల వారికి తెలిసిన వస్తువులను పిల్లలను చెప్పమనాలి. ఈ విధంగా ఎవరైతే ఎక్కువ ఆకారాలు గల వస్తుందని చెబుతారో వారిని చప్పట్లతో అభినందించాలి.

Shape hunt :

 కొన్ని కార్డులపై  కొన్ని పిక్చర్స్ ను తీసుకోవాలి అదే విధంగా కొన్ని వస్తువులను తీసుకోవాలి. ఆ  వస్తువులను ఆకారాలతో జత పరచమని చెప్పాలి. అదేవిధంగా పిల్లలను వివిధ ఆకారాలు చెప్పి ఆ ఆకారంలో ఉండే వస్తువుల బొమ్మలను గీయమని చెప్పాలి. చక్కగా గీసిన పిల్లలను చప్పట్లతో అభినందించాలి.

Vidyapravesh day 12 readiness activities for 1 and 2 classes

 విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  12వ రోజు   (11.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం


తెలుగు

కధ :  ఒక కథకు సంబంధించిన కృత్యాలను  నిర్వహించాలి. తర్వాత కథను చెప్పమని పిల్లలకు చెప్పాలి తర్వాత పిల్లలను కథను సొంతమాటల్లో చెప్పమని అడగాలి తర్వాత కథ గురించి ఎలా ఎందుకు వంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.


ధ్వని ఆటలు :

 మొదటి ధ్వని ఏమిటి అని అడుగుతూ  రెండు అక్షరాల పదాలను పిల్లలను చెప్పమనాలి.


అక్షరాలతో ఆట:

 ఉపాధ్యాయుడు ఏదో ఒక అక్షరం చెప్పాలి విద్యార్థులను ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు చెప్పమనాలి 


వ్రాయడం: 

 ఉపాధ్యాయుడు చెప్పిన ప్రధాన విని పిల్లలు వ్రాయాలి  

పాట-పద్యం:

 "ఆటలు ఆడి పాటలు పాడి అలసివచ్చెనే" అనే పాటను మరికొంతమంది పిల్లలచే పాడించాలి 


ENGLISH


 Animal sound game :


 పిల్లలకు వివిధ జంతువులు చేసే శబ్దాలను వినిపించి అది ఏ జంతువుదో చెప్పమనాలి. అలాగే ఆ జంతువు గురించి రెండు వాక్యాలు చెప్పమనాలి.


Sound safari game:


 ఎవరైతే జంతువు శబ్దాన్ని కరెక్ట్ గా చెప్పారు వారికి ఒక మార్కు ఇవ్వాలి అలాగే ఆ జంతువు గురించి రెండు వాక్యాలు చెప్పిన వారికి బోనస్ గా మరొక మార్కు ఇవ్వాలి. ఇలా ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారిని చప్పట్లతో అభినందించాలి.

 

Maths


Picture sequencing :


 ఏదైనా ఒక కథకు సంబంధించి మూడు లేదా నాలుగు పిక్చర్స్ చూపించాలి. వాటిలో ఏ పిక్చర్ మొదట వస్తుంది తర్వాత ఏది  వస్తుంది అనే వరుసక్రమాన్ని పిల్లలను పెట్టమనాలి. అప్పుడు కథలు వరుసగా చెప్పమనాలి. ఎవరైతే ఆ పిక్చర్స్ను సరైన క్రమంలో అమర్చారు వారికి sequence star బ్యాడ్జి ఇచ్చి అభినందించాలి 


Readiness activity


Sound hunt


 ఉపాధ్యాయుడు పేపర్ నలిపినశబ్దం,  పెన్సిల్ బాక్స్శబ్దం, బొమ్మ, గంట మొదలైన వాటి శబ్దాన్ని పిల్లలకు వినిపించాలి. తరగతి గదిలో వాటి శబ్దాన్ని చేస్తూ పిల్లలను అది ఏ శబ్దమో చెప్పమనాలి. అలా ఎవరైతే సరైన శబ్దాన్ని చెప్పారో వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.

Day 9 readiness program activities for 3 and 5 classes

 3 మరియు 5 తరగతుల  9వ రోజు  07.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం.

తెలుగు

 మూడు అక్షరాల పదాలను చదవడం మరియు రాయడం చెప్పాలి.

 టీచర్ బోర్డుపై మూడు అక్షరాల పదాలను రాసి స్పష్టంగా చదవాలి. ప్రతి పదాన్ని పలకడం మరియు అర్థం చెప్పడం చేయాలి. విద్యార్థులు టీచర్ చెప్పిన గుణింతాల నుండి  ఎంచుకొని వాటితో ఐదు గుణింత అక్షరాలు వర్క్ బుక్ లో రాయడం ప్రాక్టీస్ చేయాలి.

ఆట:

 పదాల రైలు  :

 ప్రతి విద్యార్థికి ఒక అక్షర కార్డు ఇవ్వాలి.టీచర్ ఒక పదం చెప్పాలి ఆ పదానికి సంబంధించిన అక్షరాలను విద్యార్థులు వరుసగా నిలబడి పదా రైలుగా మారతారు. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు పదనిర్మాణం పై అవగాహన పెరుగుతుంది.


 విద్యార్థులు శబ్దాన్ని విని దానికి సరిపోయే గుణింత అక్షరాన్ని గుర్తించగలగాలి శబ్ద, గుణింత అక్షరం జతచేయడాన్ని బట్టి టీచర్ మూల్యాంకనం చేయాలి.


ENGLISH


 Sentence writing :

 This is my father......

 ఇలా పిల్లలతో సింపుల్ గా ఉండే సెంటెన్స్ లు చెప్పించాలి. పదాలను విడివిడిగా రాయడం నేర్పించాలి వాటిని గట్టిగా చదవమని చెప్పాలి. పిల్లలను వారి ఫ్యామిలీ నేమ్స్ ఉపయోగిస్తూ రెండు సెంటెన్స్ లు రాయమని చెప్పాలి. ఇలా ఎవరైతే చక్కగా రాశారో వారిని చప్పట్లు తో అభినందింప చేయాలి.


Maths


 Counting in groups:

 2s, 5s, 10 s ఎలా ఉపయోగిస్తూ స్కిప్ కౌంటింగ్ పిల్లలకు వేగంగా చేయడం నేర్పించాలి. షూస్ జతలను లెక్కపెడుతూ అలాగే చేతివేళ్ళను లెక్కపెడుతూ అలాగే పెన్సిల్ కట్టమని లెక్కపెడుతూ పిల్లలకు  అలవాటు చేయించాలి.

 చాక్లెట్స్ బ్లాక్ ఉపయోగిస్తూ ఇటువంటి ఆక్టివిటీ చేయించాలి. పిల్లలను వ్యక్తిగతంగాను గ్రూపుల గాను ఈ యొక్క యాక్టివిటీ చేయించాలి. Group it fast apus చాలెంజ్ పెట్టి ఎవరైతే వేగంగా ఇస్కిప్ కౌంటింగ్ చేస్తారో వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.

Vidyapravesh day 9 readiness activities for 1 and 2 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  9వ రోజు   (07.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం 


తెలుగు

కధ :  ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను  పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా?  ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.


ధ్వని ఆటలు :

 కథలోని పదాలలో ఎన్ని 2 అక్షరాల ధ్వనులు  ఉన్నాయి చెప్పమనాలి.


అక్షరాలతో ఆట:

 నేను చెప్తాను మీరు చేయండి అంటూ పిల్లలకు కొన్ని అక్షరాలు చెప్పి రాయించాలి.


వ్రాయడం: 

 వర్క్ షీట్స్ ఇచ్చి రంగులు వేయమని చెప్పాలి.


పాట-పద్యం:

 తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం  అనే పాటని  పిల్లలతో పాడించాలి.


ENGLISH


 Roleplay corner :


 మనము ఏదైనా ఒక హాస్పిటల్లో లేదా మార్కెట్లో ఉన్నట్లుగా భావించమని పిల్లలకు చెప్పాలి. ఒక పిల్లవాడిని డాక్టర్ గా నటించమని చెప్పి మిగతా వారిని పేషెంట్స్ గా నటించమని చెప్పి వారి చేత మాట్లాడించాలి. అలాగే ఒక షాప్ కీపర్ గాను మిగతా వారిని కస్టమర్స్ గాను నటించమని మాట్లాడించాలి. ఈ విధంగా పిల్లలచే రోల్ ప్లే చేయించాలి.

 ఎవరైతే చక్కగా మాట్లాడారో వాళ్లని  Rolestar గా గుర్తించి వారిని పిల్లలతో చప్పట్లుచే అభినందింప చేయాలి 

 

Maths


Sorting by size :

 వివిధ సైజు లలో గల వస్తువులను సేకరించాలి. వాటిని పిల్లలకు చూపించి వారికి smallest, biggest భావనలను నేర్పించాలి. ఒక్కొక్క పేద వాడిని పిలిచి ఏది big ఏది small అంటూ అడగాలి. చక్కగా చెప్పిన వారికి size sorter మెడల్ ఇచ్చి అభినందింప చేయాలి.


Readiness activity

Traffic light game:

Red, Yellow, Green రంగుల ఫ్లాష్ కార్డులను ఉపయోగించాలి. Red కార్డు చూపిస్తే stop అని చెప్పాలి. Yellow కార్డు చూపిస్తే get ready అని చెప్పాలి. Green కార్డు చూపిస్తే Go అని చెప్పాలి. ఈ విధంగా పిల్లలతో ప్లాస్టర్ తెలిసే ఆక్టివిటీ చేయించాలి.

. బాగా చెప్పిన  వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  8వ రోజు   (05.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం 

Day 8 readiness program activities for 3 and 5 classes

3 మరియు 5 తరగతుల  8వ రోజు  05.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం

తెలుగు 

 గుణింతాల తో పదం నిర్మాణం :

 టీచర్ బోర్డుపై గుణింతాలు తో ఏర్పడే పదాలను రాయాలి. ఇలా ప్రతిపదాన్ని రాసి చదివిస్తూ దాని అర్ధాన్ని వివరంగా చెప్పాలి.పదానికి అనుగుణంగా బొమ్మ చూపించాలి. అప్పుడు విద్యార్థులు టీచర్స్ అడిగిన పదాన్ని మరలా గట్టిగా చదవాలి.ఆ పదాన్ని సంబంధిత బొమ్మతో జతపరచాలి.

ఆట:

 పదాల బుట్ట  :

 రెండు బుట్టలు తీసుకొని ఒక దానిలో పదాల కార్డులు మరొక బట్టలు బొమ్మల కార్డులు ఉంచాలి. విద్యార్థులు ఒక పదాన్ని ఎంచుకొని దానికి సరిపడే బొమ్మను ఇంకొక బుట్టలోంచి ఎంచుకుని జత చేయాలి. సరైన జత చేసినటువంటి విద్యార్థులను ప్రోత్సాహంగా చప్పట్లు కొట్టించి లేదా మంచి బహుమతి ఇచ్చి అభినందించాలి.


 విద్యార్థులు సరైన పదాన్ని చదివి ఇచ్చిన మూడు పదాలు నుంచి సరైన పదానికి సున్నా చుట్టాలి. శబ్దం, చిహ్నం, అర్థం మధ్య సంబంధాలు గుర్తించగలగాలి.


 ENGLISH 

 My family :


 పిల్లలకు father, mother, sister, brother, baby మొదలైన పదాలను పరిచయం చేయాలి. This is my father అంటూ ఫాదర్ బొమ్మ ఉన్న పిక్చర్ గా చూపించండి అలాగే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా this is my mother..... అని చెప్తూ చూపించమనాలి.

 ఫ్యామిలీ గురించి ఒక చిన్న కథ చెప్పాలి. ఒక చిన్న ఫ్యామిలీ ఫోటోను గీయమనాలి. ఫ్యామిలీ ట్రీ కూడా గీయమనాలి.


Game:

Family flash match:

 పిల్లలకు ఫ్యామిలీ మెంబర్స్ గల పిక్చర్ కార్డులు మరియు  వర్డ్స్ కార్డులు ఇవ్వాలి.

 వాటిని వేరువేరు గ్రూపులుగా విభజించి పిల్లలను జతపరచమని చెప్పాలి. ఎవరైతే సరిగ్గా జతపరిచారో వారిని అభినందించాలి.


Maths 

 Comparing numbers :


 Less than (<) , greater than (>) , is equal to (= ) మొదలైన గుర్తులను పరిచయం చేయాలి. ఆ గుర్తులను ఏ విధంగా వినియోగించాలో పిల్లలకి అర్థం అయ్యేలా చెప్పాలి. వివిధ అంకెల జఫలము లాస్ట్ కార్డులపై లేదా బోర్డుపై రాసి చూపించాలి. ఆ అంకెల మధ్య సరైన గుర్తు ఉపయోగించమని చెప్పాలి. పెద్ద సంఖ్య చిన్న సంఖ్య వాటిని గుర్తించి సున్నాలు చుట్టమని చెప్పాలి. ఎవరైతే చక్కగా చేశారో వారిని పిల్లలందరితో చప్పట్లు కొట్టించి అభినందించాలి.

Vidyapravesh day 8 readiness activities for 1 and 2 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  8వ రోజు   (05.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం 

 తెలుగు 

కధ :  ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను  పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా?  ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.


ధ్వని ఆటలు :

 కథలోని పదాలలో ఎన్ని పనులు ఉన్నాయి చెప్పమనాలి


అక్షరాలతో ఆట:

 పిల్లలకు ఇప్పటివరకు నేర్పించిన అక్షరాలు వెతికించే ఆట ఆడించాలి.


వ్రాయడం: 

 నేను చెప్తాను మీరు చేయండి అంటూ పిల్లలకు కొన్ని అక్షరాలు చెప్పి రాయించాలి.


పాట-పద్యం:

 తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం  అనే పాటని పాడి వినిపించి ఆ తరువాత  కొంతమంది పిల్లలతో పాడించాలి.


 ENGLISH 


 Who am I ? :

 ఏవైనా కొన్ని జంతువులు లేదా వస్తువుల గురించి పిల్లలకు వివరించి వాళ్ళు జాగ్రత్తగా వినేలా చేయాలి. తర్వాత టీచర్ ఆ పిల్లలను ఈ వస్తువు లేదా జంతువును గురించి రెండు లేదా మూడు clues ఇస్తూ Who am I ? అని అడగాలి. ఇలా విద్యార్థులందరినీ అడగాలి.

 ఎవరైతే చక్కగా జవాబులు చెప్పగలుగుతారో వారిని రriddle champion గా గుర్తించి అభినందించాలి.

 

Maths 

Spot the difference :


 ఓకే రకంగా ఉండే రెండు పిక్చర్స్ ను తీసుకోవాలి. వాటిలో గల తేడాను ఒకదాన్ని వివరించాలి. మిగతా తేడాలను గుర్తించమని  పిల్లల్ని అడగాలి. ఆ గుర్తించిన తేడాలను గట్టిగా చెప్పమనాలి. అలా చెప్పిన పిల్లలను  difference detective గా ప్రకటించి

 చప్పట్లతో  అభినందింప చేయాలి.


Readiness activity

Flash light hide seek game:


 తరగతులు ఉన్నటువంటి అన్ని వస్తువులను గమనించమని పిల్లలతో చెప్పాలి. తరువాత తరగతి గదిని వీలైనంత తక్కువ వెలుతురు ఉండేలా చేయాలి. ఒక ఫ్లాష్ లైట్ తీసుకుని తరగతుల వివిధ వస్తువులపై వేయాలి. ఎవరైతే ఆ  వస్తువు పేరు సరిగ్గా చెప్పారో వారిని అభినందించాలి. ఇలా తరగతుల గల విద్యార్థులు అందరి చేత ఆడించాలి. బాగా చెప్పిన  వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.

Sarvepalli Radha Krishnan Vidyarthi Mithra APP - Students Kits APP latest Version : 1.7.6

సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర యాప్ లేటెస్ట్ వెర్షన్ 1.7.6 కు అప్డేట్ చేయబడింది. క్రింది లింక్ ద్వారా యాప్ ను అప్డేట్ చేసుకోగలరు.


https://play.google.com/store/apps/details?id=com.ap.studentkits

Vidyapravesh day 7 readiness activities for 1 and 2 classes

 విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  7వ రోజు   (04.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం 

తెలుగు


కధ :  ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను  పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా?  ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.


ధ్వని ఆటలు :

 వేర్వేరు జంతువుల అరుపులలో తేడాలు గుర్తించమని.


అక్షరాలతో ఆట:

 పిల్లలకు ఇప్పటివరకు నేర్పించిన అక్షరాలు వెతికించే ఆట ఆడించాలి.


వ్రాయడం: 

 ఏదైనా ఒక కథను బొమ్మల రూపంలో గీసి పిల్లలకు వివరించాలి..


పాట-పద్యం:

 ఆనందం ఆనందం మాటలే పిల్లల ఆనందం అనే పాటని కొంతమంది పిల్లలతో పాడించాలి.


ENGLISH


 What's missing :

 పిల్లలకు తెలిసిన ఐదు తరగతి గదిలో ఉండే వస్తువులను తీసుకొని వాటిని పిల్లలకు చూపించాలి. ఆ వస్తువులను ఏదో ఒక ట్రే లో లేదా టేబుల్ పైన ఉంచాలి. అన్ని వస్తువులని ఒక గుడ్డతో కప్పి ఉంచాలి. అందులో నుండి నెమ్మదిగా ఒక వస్తువుని తీసివేసి పిల్లలను పిలిచి ఏ వస్తువు మిస్ అయిందో చెప్పమని అడగాలి.

 ఎవరైతే చక్కగా జవాబులు చెప్పగలుగుతారో వారిని మెమరీ మాస్టర్ గా గుర్తించి అభినందించాలి.

 

Maths


Pattern train :

 ఏదైనా ఒక pattern తీసుకుని దానిని మరలా మరలా రిపీట్ అయ్యేదా అమర్చాలి.

Ex: red-blue-red- blue...

 పిల్లలను ఆ పాటల్లో ఆ తర్వాత ఏది వస్తుందో చెప్పమని అడగాలి. ఇలా తరగతుల విద్యార్థులు అందరి చేత చేయించాలి. ఎవరైతే చక్కగా చేయగలిగారో వారికి pattern builder badge ఇచ్చి పిల్లలను చప్పట్లతో  అభినందింప చేయాలి.


Readiness activity


Shadow match game:


 ఏవైనా కొన్ని నిజమైన వస్తువులను మరియు వాటి నీడలు ఉండే కార్డులను తీసుకోవాలి. ఒకవైపు వస్తువులను మరొకవైపు వాటి నీడలను వివిధ క్రమాలలో అమర్చి వాటిని జతపరచమనాలి. ఈ విధంగా పిల్లలను వ్యక్తిగతంగాను మరి గ్రూపులుగా విభజించి జత పరచమనాలి. ఎవరైతే చక్కగా జతపరిచారో వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.

Day 7 readiness program activities for 3 and 5 classes

3 మరియు 5 తరగతుల  7వ రోజు  04.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం

తెలుగు

 గుణింతాల పరిచయం:

 ప గుణింతపు అక్షరాల చార్టును చూపించాలి. గుణింత అక్షరాలను టీచర్ పలుకుతూ విద్యార్థులచే పదేపదే పలికించాలి. ప్రతి గుణింత అక్షరాన్ని స్పష్టంగా పలకడం మరియు చూపించడం చేయాలి.తర్వాత వర్క్ బుక్ లో లేదా అక్షర పట్టికలో ప్రతి గుణింత అక్షరాన్ని గుర్తించమనాలి.


ఆట:

 చేపల పట్టు - గుణింత ఆక్షరం చెప్పు :


 ప్రతి గుణింత అక్షరంతో కాగితపు చేపలను తయారు చేయాలి విద్యార్థులను కర్రకు మాగ్నెట్ లేదా హుక్కు కట్టి చేపలను పట్టుకోమని చెప్పాలి ఎంచుకున్న చేప పైన ఉన్న గుణింత అక్షరాన్ని స్పష్టంగా పలకమనాలి. సరైన ఉచ్చారణ  కోసం ప్రోత్సహించాలి. సరిగ్గా చెప్పిన పిల్లలను అభినందించాలి.


ENGLISH

 My body :


 ముందు రోజు పిల్లలకు చెప్పిన  Eye, Ear, Nose, Hand, Leg వంటి  బాడీ పార్ట్స్ ను రివైజ్ చేయాలి. మ్యాగ్నెటిక్ అక్షరాలు లేదా అట్టపై వ్రాసిన అక్షరాలు ఉపయోగించి  బాడీ parts ను స్పెల్లింగ్ పేర్చమని చెప్పాలి. పిల్లలను బాడీ పార్ట్స్ ను నోట్ బుక్ పై లేదా బోర్డుపై రాయమని చెప్పాలి. బాడీ పార్ట్స్ లో లెటర్స్ ను jumble చేసి పిల్లల్ని సరిగా పేర్చమనాలి. చక్కగా అభ్యాసాలు చేసిన పిల్లలను అభినందించాలి.


Maths

 subtraction stories :


 చిన్నచిన్న కథలు తో తీసివేత లను నేర్పించాలి. నా దగ్గర ఐదు చాక్లెట్లు ఉన్నాయి నేను రెండు చాక్లెట్లు తిన్నాను ఇంకా ఎన్ని ఉంటాయి ఈ రకంగా ప్రశ్నలు అడగాలి. అదేవిధంగా పిల్లల్ని కూడా సొంతంగా ఇటువంటి కథలు చెప్పమని తీసివేతలు చేయించాలి.


Game :

Frog jump backward :


 నేలపై వరుసగా గడులు గీసి వాటిలో కొన్ని అంకెలు రాయాలి. పిల్లలను ఏదో ఒక అంకెపై నించుని ఆ అంకెనుండి రెండు లేదా మూడు గడులు వెనక్కు కప్పల దూకమని చెప్పాలి.

 అప్పుడు ఆ దూకిన గడిలో ఏ అంకె ఉందో చెప్పమనాలి. ఈ విధంగా వారికి తీసివేతలు నేర్పించాలి. ఎవరైతే చక్కగా చేశారో వారిని పిల్లలందరితో చప్పట్లు కొట్టించి అభినందించాలి.

Day 6 readiness program activities for 3 and 5 classes

3 మరియు 5 తరగతుల 6 వ రోజు  03.07.2025  తరగతి సంసిద్ధతా కార్యక్రమం 

 తెలుగు 

 గుణింతాల పరిచయం:

 క గుణింతపు అక్షరాల చార్టును చూపించాలి. గుణింత అక్షరాలను టీచర్ పలుకుతూ విద్యార్థులచే పదేపదే పలికించాలి. తర్వాత వర్క్ బుక్ లో లేదా అక్షర పట్టికలో ప్రతి గుణింత అక్షరాన్ని గుర్తించమనాలి.


ఆట:

గుణింతహారము:


 ప్రతి గుణింత అక్షరంతో ఉన్న చిన్న కార్డును పుష్పాల ఆకారంలో తయారు చేయాలి. ఒక్కో విద్యార్థి ఒక పుష్పాన్ని ఎంచుకొని అందులో ఉన్న గుణింత అక్షరాన్ని పలకాలి. తర్వాత పుష్పాలను ఒక దారంతో గుచ్చాలి.చివరికి ఒక గుణింతహారము తయారవుతుంది. పిల్లలు కనీసం 5 గుణింత అక్షరాలను గుర్తించి చదవగలగాలి.


 ENGLISH 


 My body :


Eye, Ear, Nose, Hand, Leg వంటి 5 బాడీ పార్ట్స్ ను బొమ్మలతో చూపించాలి. ప్రతి పార్ట్ ను చూపెడుతూ పిల్లలతో  గట్టిగా చెప్పించాలి.

This is my nose....

These are my ears... ఈ విధంగా సెంటెన్స్ లు చెప్పించాలి.

 ఒకవైపు బాడీ పార్ట్శ్ యొక్క బొమ్మలను మరోవైపు బాడీ పార్ట్శ్ పేర్లను రాయాలి పిల్లల్ని వేపించి వాటిని జతపరచమని చెప్పాలి.

Game: 

 టీచర్ పిల్లలకు ఏదో ఒక బాడీ పార్ట్ పేరు చెప్పాలి అప్పుడు పిల్లలు టీచర్ చెప్పిన ఆ బాడీ పార్ట్ ను తమ చేతితో ముట్టుకొని చెప్పగలగాలి. అలా పిల్లలందరిసె చేయించాలి. ఎవరైతే చక్కగా అలా చేశారో వారిని చప్పట్లతో అభినందించాలి.


Maths 


Introduction to subtraction :


 ఒక ప్రదేశంలో కొన్ని వస్తువులను ఉంచి వాటిలో కొన్ని వస్తువులను తీసుకోవడం ద్వారా పిల్లలకు తీసివేత ప్రక్రియ నేర్పించాలి.

 5 లేదా 10  ఇలా పిల్లలకు తెలిసేలా కొన్ని  పండ్లు, బొమ్మలు లేదా బ్లాక్స్ ను ఒక బుట్టలో ఉంచాలి. పిల్లలకు కనిపించేలా వాటిలో కొన్ని వస్తువులను లెక్కపెడుతూ తీయాలి. ఇంకా ఎన్ని వస్తువులు ఉన్నాయో పిల్లలను లెక్కపెట్టి చెప్పమనాలి.

 ఇదే ప్రక్రియను పిల్లల చేత మరలా మరలా కొనసాగింప చేయాలి.

 పిల్లలకు గోళీలు మొదలైన వస్తువులు ఇచ్చి అందులోంచి కొన్ని వస్తువులు తీసుకుని మిగతా ఎన్ని మిగిలాయో  చెప్పమనాలి. ఈ విధంగా ఎవరైతే చక్కగా చేస్తారో వారిని చప్పట్లతో అభినందించాలి.

Vidyapravesh day 6 readiness activities for 1 and 2 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు 6 వ రోజు   (03.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం 

 తెలుగు 


కధ :  ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను  పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా?  ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.


ధ్వని ఆటలు :

 వేర్వేరు వస్తువుల శబ్దాల గురించిన ఆటాడించాలి


అక్షరాలతో ఆట:

 టీచర్ ఏమి చెప్పారో పిల్లలు అదే చేసేలా వారిని ఆడించాలి.


వ్రాయడం: 

 టీచర్ ఏమి రాశారో పిల్లలు కూడా అలాగే రాయమనాలి.


పాట-పద్యం:

 ఆనందం ఆనందం మాటలే పిల్లల ఆనందం అనే పాటని పెద్ద సమూహంతో పిల్లలకు నేర్పి పాటించాలి.


 ENGLISH 


 Emotion mirror :

 పిల్లలకు రకరకాల ఎమోషన్స్ ను టీచర్ ఏ విధమైన మాటలు మాట్లాడకుండా  తమ యొక్క అభినయంతో చూపించాలి. పిల్లలను జాగ్రత్తగా గమనించమనాలి. Angry, happy, sad, surprise మొదలైన ఫీలింగ్స్ ను అభినయంతో చూపాలి. పిల్లలను అభినయాలను వివరించి చెప్పమనాలి. ఎవరైతే ఎక్కువ విషయాలు చెప్పగలరు వారిని Best mirror actor గా ప్రకటించి అభినందించాలి 

 

Maths 

Touch and tell :


Soft, hard, rough ఇలా వివిధ రకాలుగా ఉండేటటువంటి వస్తువులను పిల్లలకు ఇచ్చి ముట్టుకుని అది ఎలా ఉందో చెప్పమనాలి. ఒక్క ఒక క్లాత్ బ్యాగులు ఎరేజర్ స్పూన్ స్పాంజ్ లాంటి వస్తువులను ఉంచాలి. ఒక్కొక్క పిల్ల వాడిని పిచ్చి సంచి లోపల చెయ్యి పెట్టి ఏదో ఒక వస్తువుని ముట్టుకుని అది ఎలా ఉందో చెప్పమనాలి. ఎవరైతే బాగా చెప్పగలిగారు వారికి tactile star అవార్డు ఇచ్చి అభినందించాలి.


Readiness activity


 రంగురంగుల కప్పులు మరియు పూసలను తీసుకోవాలి. ఆ కప్పులను విడివిడిగా ఉంచాలి. వేరొక చోట అన్ని రంగులు కలిసిన పూసలు ఉంచాలి. ఈ పూసలను ఆ పూస ఏ రంగులో ఆ రంగు పేరుని గట్టిగా పైకి చెప్పి అదే రంగు కప్పులో వేయమని పిల్లలకు చెప్పాలి. ఇలా ఎవరైతే తక్కువ సమయంలో ఎక్కువ పూసలు వేశారో వారిని colour champion గా ప్రకటించి అభినందించాలి.

Mega parent teacher meeting YouTube live Session by honorable Director sir

మెగా PTM 2. O సందర్భంగా ఈ రోజు 02-07-2025  సాయంత్రం 5 గంటలకు PRIMARY & SECONDARY HMs, స్కూల్ కాంప్లెక్స్ HMs, మండల అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, YouTube LIve సెషన్ ద్వారా గౌరవ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ గారు ముఖ్యమైన సూచనలు, ఆదేశాలు ఇస్తారు. కావున అందరూ తప్పక వీక్షించవలసింది కొరడామైనది.

https://youtube.com/live/748Q0oFC1HI?feature=share 


LATEST POSTS

Vidyapravesh day 15 readiness activities for 1 and 2 classes

విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  15 వ రోజు   (16.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం  తెలుగు  కధ :  కథలో రోల్ ప్లే చేసి చూపమని పిల్లలకు చెప...