విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 9వ రోజు (07.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : ఏదైనా ఒక కథకు సంబంధించిన కృత్యాన్ని నిర్వహించాలి..ఆ కథను పిల్లలకు చెప్పాలి.పిల్లల్లో ఒకరిని కథను తన సొంతమాటల్లో చెప్పమని అడగాలి. తర్వాత కథ గురించి ఎలా? ఎందుకు? లాంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
కథలోని పదాలలో ఎన్ని 2 అక్షరాల ధ్వనులు ఉన్నాయి చెప్పమనాలి.
అక్షరాలతో ఆట:
నేను చెప్తాను మీరు చేయండి అంటూ పిల్లలకు కొన్ని అక్షరాలు చెప్పి రాయించాలి.
వ్రాయడం:
వర్క్ షీట్స్ ఇచ్చి రంగులు వేయమని చెప్పాలి.
పాట-పద్యం:
తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అనే పాటని పిల్లలతో పాడించాలి.
ENGLISH
Roleplay corner :
మనము ఏదైనా ఒక హాస్పిటల్లో లేదా మార్కెట్లో ఉన్నట్లుగా భావించమని పిల్లలకు చెప్పాలి. ఒక పిల్లవాడిని డాక్టర్ గా నటించమని చెప్పి మిగతా వారిని పేషెంట్స్ గా నటించమని చెప్పి వారి చేత మాట్లాడించాలి. అలాగే ఒక షాప్ కీపర్ గాను మిగతా వారిని కస్టమర్స్ గాను నటించమని మాట్లాడించాలి. ఈ విధంగా పిల్లలచే రోల్ ప్లే చేయించాలి.
ఎవరైతే చక్కగా మాట్లాడారో వాళ్లని Rolestar గా గుర్తించి వారిని పిల్లలతో చప్పట్లుచే అభినందింప చేయాలి
Maths
Sorting by size :
వివిధ సైజు లలో గల వస్తువులను సేకరించాలి. వాటిని పిల్లలకు చూపించి వారికి smallest, biggest భావనలను నేర్పించాలి. ఒక్కొక్క పేద వాడిని పిలిచి ఏది big ఏది small అంటూ అడగాలి. చక్కగా చెప్పిన వారికి size sorter మెడల్ ఇచ్చి అభినందింప చేయాలి.
Readiness activity
Traffic light game:
Red, Yellow, Green రంగుల ఫ్లాష్ కార్డులను ఉపయోగించాలి. Red కార్డు చూపిస్తే stop అని చెప్పాలి. Yellow కార్డు చూపిస్తే get ready అని చెప్పాలి. Green కార్డు చూపిస్తే Go అని చెప్పాలి. ఈ విధంగా పిల్లలతో ప్లాస్టర్ తెలిసే ఆక్టివిటీ చేయించాలి.
. బాగా చెప్పిన వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.