మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

NATO (North Atlantick trity organization ) History and Group of countries in nato

 What Is NATO: ఎక్కడ చూసినా 'నాటో' చర్చ! సభ్య దేశాల జాబితా తెలుసా?

ప్రస్తుతం ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించి ఆరో రోజులైంది. అసలు ఒక దేశానికి మరో దేశానికి మధ్య ఎంత శత్రుత్వం ఉన్న మాటల పరంగానో, ఆంక్షలు పరంగానో ఉండేవి గానీ యుద్ధం వరకు వెళ్లేది కాదు.కానీ తాజాగా ఉక్రెయిన్‌ రష్యా ఉదాంతాం మాత్రం అలా కాకుండా నేరుగా రణరంగంలో ఢీకోడుతున్నాయి. అసలు ఈ యుద్ధానికి ప్రధాన కారణం నాటోలో ఉక్రెయిన్‌ చేరాలనుకోవడమే. అసలు నాటో అంటే ఏమిటి. అందులో ఉ‍క్రెయిన్‌ చేరితో రష్యాకు ఎందుకు నచ్చట్లేదు.. తెలుసుకుందాం!నాటో అంటే..

నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) అనేది ఉత్తర అట్లాంటిక్ కూటమి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్‌ సహా 12 దేశాల సైనిక కూటమి. ఈ సంస్థ 4 ఏప్రిల్ 1949న సంతకం చేసిన ఉత్తర అట్లాంటిక్ ఒప్పందాన్ని అమలు చేస్తుంది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి తమని తాము రక్షించుకనేందుకు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, ఇటలీ, నార్వే, నెదర్లాండ్స్, కెనడా నాటోని స్థాపించాయి. దీని ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది. ఇందులోని ఒప్పందం ప్రకారం.. నాటోలో సభ్య దేశాలుగా ఉ‍న్న ఏ ఒక్క దేశంపైన ఏ కారణం చేతనైనా బయట దేశాలు సాయుధ దాడి జరిపినట్లయితే.. ఆ దేశానికి నాటోలోని మిగిలిన సభ్య దేశాలన్నీ సహాయం చేయాలి. మరో లక్ష్యం ఏమంటే.. రెండో ప్రపంచ యుద్ధానంతరం యూరప్‌లో సోవియట్ రష్యా విస్తరణ ముప్పును అడ్డుకునేందకని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం రష్యా కూడా నాటోలో ఉక్రెయిన్‌ చేరాలంటే వ్యతిరేకిస్తోంది కూడా అందుకే!ప్రపంచంలోనే పవర్‌పుల్‌ కూటమి..

ప్రస్తుతం నాటోలో 30 దేశాలు ఉన్నాయి. వారు అధికారికంగా నాటో సభ్యులు. నాటోలో 27 యూరోపియన్ దేశాలు, యురేషియాలో ఒక దేశం, ఉత్తర అమెరికాలో 2 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. నాటో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కూటమిగా పిలుస్తారు. ఎందుకుంటే శక్తివంతమైన యూరోపియన్‌ దేశాలు, సంపన్న దేశాలు నాటో సభ్య దేశాలుగా ఉన్నాయి. అంతేకాకుండా ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశంగా పిలువబడే అమెరికా కూడా దానిలో భాగం. నాటో కూటమి సైనిక బలగం, వారి వద్ద ఉండే అత్యాధునికి ఆయుధాలు ఇలా ఒక్కటేంటి.. నాటో కూటమిలోని దేశాలలో ఏ ఒక్క దేశంతో యుద్ధం చేస్తే వార్‌ వన్‌సైడ్‌ అని క్లారిటీగా చెప్పవచ్చు.నాటో అంటే గిట్టని రష్యా..

రష్యా మినహా పూర్తి యూరోపియన్ దేశాలు దానిలో సభ్యులుగా ఉన్నాయి. ఈ కూటమిలో భాగం కాని ఏకైక దేశం ఇది. దీనికి రష్యా , నాటో అంతర్గత కారణాలే అని చెప్పచ్చు. తాజాగా ఉక్రెయిన్‌ రష్యా సరిహద్దు దేశం కావడం , అది నాటో చేరాలని ప్రయత్నించడంతో రష్యాకు దిగులు పట్టుకుంది. ఎందుకంటే ఉక్రెయిన్‌ నాటోలో చేరితో పశ్చాత్య దేశాలు ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని రష్యాను ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయని పుతిన్ భావించాడు. అందుకు ఉక్రెయిన్‌ విషయంలో పరిస్ధితులు యద్ధానికి దారితీశాయి.

సభ్య దేశాలు చేరిన సంవత్సరం

1.👉 యునైటెడ్ స్టేట్స్ 1949

2.👉 యునైటెడ్ కింగ్‌డమ్ 1949

3.👉 పోర్చుగల్ 1949

4.👍నార్వే 1949

5.👉ఐస్లాండ్ 1949

6.👉నెదర్లాండ్స్ 1949

7.👉లక్సెంబర్గ్ 1949

8 .👉ఇటలీ 1949

9.👉ఫ్రాన్స్ 1949

10.👉డెన్మార్క్ 1949

11.👉కెనడా 1949

12.👉బెల్జియం 1949

13.👉టర్కీ 1952

14.👉గ్రీస్ 1952

15.👉జర్మనీ 1982

16.👉స్పెయిన్ 1955

17.👉పోలాండ్ 1999

18.👉హంగేరి 1999

19.👉చెక్ రిపబ్లిక్ 1999

20.👉స్లోవేకియా 2004

21.👉స్లోవేనియా 2004

22.👉రొమేనియా 2004

23.👉లిథువేనియా 2004

24.👉లాట్వియా 2004

25.👉ఎస్టోనియా 2004

26.👉బల్గేరియా 2004

27.👉క్రొయేషియా 2009

28.👉అల్బేనియా 2009

29.👉ఉత్తర మాసిడోనియా 2020

30👉.మోంటెనెగ్రో 2017

LATEST POSTS

check PTM data in given link for submitted schools list

క్రిందనున్న డాష్ బోర్డులో జిల్లా, మండలం సెలెక్ట్ చేసి GO మీద ప్రెస్ చేస్తే మండలంలో ఏఏ పాఠశాల PTM డేటా స్కూల్ అటెండెన్స్ app లో అప్లోడ్ అయింద...