తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో డిస్టెన్స్(దూర) విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ఆ వర్సిటీలో చేరవద్దని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) హెచ్చరించింది. దూర విద్యకు సంబంధించి యూజీసీ నుంచి ఈ వర్సిటీ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ యూనివర్సిటీ ప్రకటించే వివిధ కోర్సుల్లో విద్యార్థులు చేరవద్దని కోరింది. ‘‘అన్నామలై వర్సిటీ ఓపెన్, డిస్టెన్స్ విధానంలో విద్యార్థులను చేర్చుకునేందుకు ప్రకటన జారీ చేసినట్టు తెలిసింది. కానీ, యూజీసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. కాబట్టి ఈ వర్సిటీలో ఎవరూ చేరవద్దు’’ అని యూజీసీ సెక్రటరీ రజనీశ్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
Ap intermediate first year and second year public examinations time table
ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలు 2027, ఫస్ట్ & సెకండ్ ఇయర్ షెడ్యూల్ విడుదల AP ఇంటర్ పరీక్షల తేదీలు. ఏపీలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుద...
No comments:
Post a Comment