📘 AP TET Related Posts

    మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

    🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

    Vidyapravesh day 24 school readiness activities for 1 and 2 classes and class readiness for 3 and 5 classes

    విద్యా ప్రవేశ్  1 , 2  తరగతులు  25 వ రోజు   (28.07.2025 )  తరగతి సంసిద్ధతా కార్యక్రమం

     1 ,  2  తరగతులు 

     తెలుగు 

    కధ :  కథను రోల్ ప్లే చేసి చెప్పమని పిల్లలకు చెప్పాలి. 


    ధ్వని ఆటలు :

     మూడు అక్షరాల పదాలను విడదీయడం మూడు అక్షరాల పదాలలో మూడవ అక్షర ధ్వనిని మార్చి చెప్పడం చేయాలి.


    అక్షరాలతో ఆట:

     టీచర్ తరగతి గదిలో  నేలపైన గొడులలో మూడు అక్షరాల పదాలను రాసి చెప్పిన పదంపై పిల్లలను దూకమనే విధంగా  ఆటను ఆడించాలి 


    వ్రాయడం: 

     అక్షర ఆకారంలో ఉన్న చుక్కల్ని కలుపుతూ అక్షరాలను రాయడం, పలకడం నేర్పించాలి. రోజుకు ఐదు నుంచి ఆరు అక్షరాలతో కృత్యాన్ని  నిర్వహించాలి.


    పాట-పద్యం:

     అమ్మకు జేజే నాన్నకు జేజే పాటను పిల్లలచే సమూహంగా పాడించాలి.


     ENGLISH 


    Who's missing? :


     బోర్డుపై కొన్ని పదాలను రాసి పిల్లలను జాగ్రత్తగా ఆ పదంలోని అక్షరాలను గమనించమని చెప్పాలి అందులో ఒక అక్షరాన్ని చెరిపేసి ఏ అక్షరాన్ని చెరిపేసాము చెప్పమనాలి. ఈ విధంగా ఆ పదంలో ఏదో ఒక అక్షరాన్ని చెరిపేయడం లేదా మూసి ఉంచడం ద్వారా మిస్సింగ్ లెటర్ ను పిల్లలచే చెప్పించాలి. ఈ విధంగా ఎవరైతే చక్కగా చెప్పారో వారిని Memory  star గా గుర్తించి పిల్లలచే చప్పట్లతో అభినందింప చేయాలి 


     Maths 


    Problem-solving circle :

     పిల్లలకు ప్రస్తుతం జీవితంలో ఎదురయ్యే చిన్ని చిన్ని సమస్యల గురించి చెప్పి వారైతే ఏం చేస్తారు అని అడగాలి ఈ విధంగా ప్రతి ఒక్కరి యొక్క అభిప్రాయాన్ని కనుక్కోవాలి ఎవరైతే చక్కగా  అభిప్రాయం చెప్పారో వారిని Idea star గా బ్యాడ్జి ఇచ్చి పిల్లల సమక్షంలో చప్పట్లతో అభినందింప చేయాలి.

     

    Readiness activity

    What is in the box?  


     ఒక మిస్టరీ బాక్స్ తీసుకుని అందులో ఎవరికి తెలియకుండా ఒక వస్తువుని ఉంచాలి. ప్రతి పిల్లవాడిని పిలిచి ఆ బాక్స్ లో చేయి పెట్టమనాలి ఆ వస్తువును పట్టుకుని అది ఏ వస్తువో చెప్ప మనాలి. ఎవరైతే చక్కగా చెప్పగలిగారో వారిని చప్పట్లతో అభినందించాలి.


    తరగతి సంసిద్ధతా కార్యక్రమం  25 వ రోజు   28.07.2025  3 మరియు 5   తరగతులు 

     తెలుగు 

      పిల్లలకు నాలుగు వాక్యాలతో ఉన్న చిన్న ప్యాసేజ్ సిద్ధం చేసి చదివి వినిపించాలి. ఉదాహరణకు నాలుగు వాక్యాలతో ఉన్న మామిడి చెట్టు గురించి ఒక ప్యాసేజ్ ను సిద్ధం చేసి దానిని నెమ్మదిగా చదివి అందులో ఉన్న విషయాలపై ప్రశ్నలు అడగాలి. ఏ చెట్టు గురించి మాట్లాడుతున్నారు చెట్టు మీద ఏముంది ఇలాంటి ప్రశ్నలు అడగాలి.

     విద్యార్థులు ప్యాసేజ్ ను చదివి కొత్త పదాలను అండర్ లైన్ చేయాలి టీచర్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.

    ఆట:

    పదం కనుక్కో 

     టీచర్ ఏదైనా ఒక పదాన్ని చెప్పినప్పుడు విద్యార్థులు ఆ పదాన్ని తమ పేపర్లో గుర్తించి చూపించాలి లేదా  రంగుల పెన్సిల్ తో హైలెట్ చేయాలి. చదివిన ప్యాసేజ్ ఆధారంగా రెండు ప్రశ్నలకు రాత సమాధానాలు రాయాలి.


     ENGLISH 

    Calender- Days of week :


     టీచర్లు పిల్లలకు క్యాలెండర్ లోని వారాలు మరియు పదాల పేర్లు చెప్పాలి ఉదాహరణకు సండే మండే మొదలైనవి. దీనికోసం క్యాలెండర్ చార్ట్ లేదా ఫ్లాష్ కార్డు లను ఉపయోగించవచ్చు. క్యాలెండర్ లో ఉన్న వారాలు లేదా పదాలు పిల్లలకు చూపించి అవి చెప్పమనాలి. వారాల పేర్లు నేలపై రాసి ఒక వారం పేరు చెప్పి పిల్లలను ఆ వారంపై దూకమని చెప్పాలి. ఈ విధంగా ఎవరైతే పిల్లలు సక్కగా చేస్తారో వారిని చప్పట్లతో అభినందించాలి.


    Maths 

    math games- apus multiplication &Division


     ఎక్కాలని పిల్లల సే చదివించి ప్రాక్టీస్ చేయించాలి. నిత్యజీవితంలో వారికి ఎదురుగే సమస్యలను డివిజన్స్ మరియు మల్టిప్లికేషన్స్ రూపంలో చెప్పాలి. ఫ్లాష్ కార్డు ఉపయోగించి గుణకారాలు చేయించాలి. సరైన జవాబు ఉంది కదా కార్డులు పిల్లలు ఎన్నుకునేలా చేయాలి. అదేవిధంగా వివిధ ఎక్కాల యొక్క  జవాబులను పిల్లలను వరుసగా చెప్పమనాలి. ఎవరైతే చక్కగా చెప్పారో వారిని చప్పట్లతో అభినందించాలి.

    No comments:

    Post a Comment

    LATEST POSTS

    NMMS Day 9 online practice questions

    NMMS పరీక్షలుకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు.మీ పేరు ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే 15 ప్రశ్నలతో exam open అవుతుంది.15 ప్రశ్నలు పూర్తి అయిన తరువ...