AP DSC 2025 ఫలితాలు విడుదల
వ్యక్తిగత లాగిన్లో ఫలితాలు చూసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల నియామకానికి మేగా డీఎస్సీ–2025 నిర్వహిస్తోంది. అభ్యర్థులు నుండి వచ్చిన అభ్యంతరాలను క్షుణ్ణంగా పరిశీలించి సమర్పించిన తుది కీ ఆధారంగా నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారా రూపొం దించిన డీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేయడమైనది. అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్ ద్వారా తుది ఫలితాలను, స్కోర్ కార్డును పొందవచ్చు.
టెట్ వివరాలకు సంబంధించిన ఎలాంటి అభ్యంతరాలు ఉన్నట్లయితే అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో https://apdsc.apcfss.in హెల్ప్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తమకు తాము టెట్ వివరాలు సరిపరచుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది.