మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

ఎవరి వద్ద ఎంత సైన్యం? ఎన్ని ఆయుధాలు?... రష్యా, ఉక్రెయిన్ బలాబలాల వివరాలు ఇవిగో!

ఉక్రెయిన్ ను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా భారీ ఎత్తున దాడులకు తెగబడింది. అత్యంత బలహీన దేశాల్లో ఒకటైన ఉక్రెయిన్ పై రష్యా నేడు పిడుగుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచంలోనే క్షిపణి పరిజ్ఞానం పరంగా చూస్తే రష్యా అగ్రగామిగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం.

మరోవైపు ఉక్రెయిన్ అందుకు పూర్తి విరుద్ధం. ఇప్పటికే ఆర్థికలేమితో సతమతమవుతున్న ఉక్రెయిన్ ను అరకొర ఆయుధ సంపత్తి, పరిమితంగా ఉన్న సాయుధ బలగాలు తాజా గండం నుంచి గట్టెక్కిస్తాయని ఎవరూ భావించడంలేదు.

 దాదాపు 2 లక్షలకు పైగా రష్యా సైనిక దళాలు అర్ధచంద్రాకారంలో ఉక్రెయిన్ ను చుట్టుముట్టి ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఉక్రెయిన్ దళాలు ప్రతిఘటించకుండానే రష్యా బలగాలకు దాసోహం అంటున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలాగే రష్యా కూడా సైన్యం, ఆయుధాల కోసం భారీ బడ్జెట్ కేటాయించే దేశాల్లో ఒకటి.

2020లో రష్యా సైనిక వ్యయం 61.7 బిలియన్ డాలర్లు కాగా, అదే సమయంలో ఉక్రెయిన్ కేవలం 5.9 బిలియన్ డాలర్లు తన సైన్యంపై ఖర్చు చేసింది. ఆ లెక్కన ఉక్రెయిన్ కంటే రష్యా సైనిక బడ్జెట్ పది రెట్లు అధికం.  ప్రపంచదేశాల్లో అత్యంత శక్తిమంతమైన సైన్యం కలిగిన దేశాల్లో రష్యా 2వ స్థానంలో ఉంటే... ఈ జాబితాలో ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, రష్యా, ఉక్రెయిన్ దేశాల బలాబలాలు ఎంతన్నది ఆసక్తి కలిగిస్తోంది.


రష్యా...

క్రియాశీలక సైనికులు- 8.50 లక్షల మంది

యుద్ధ ట్యాంకులు- 12,500

సాయుధ వాహనాలు- 30,000

మొత్తం వాయుసేన విమానాలు- 4,100 (వాటిలో 772 ఫైటర్ జెట్లు)

శతఘ్నులు-14,000

యుద్ధ నౌకలు- 600

జలాంతర్గాములు- 70


ఉక్రెయిన్...

క్రియాశీలక సైనికులు- 2.50 లక్షలు

యుద్ధ ట్యాంకులు-2,600

సాయుధ వాహనాలు- 12,000

శతఘ్నులు- 3,000

మొత్తం వాయుసేన విమానాలు- 318 (వాటిలో 69 ఫైటర్ జెట్లు)

యుద్ధ నౌకలు-38

జలాంతర్గాములు-0


ఇక, అణ్వాయుధాల విషయానికొస్తే రష్యా వద్ద ఈ ప్రపంచంలో మరే దేశం వద్ద లేనంతగా 6,257 ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... 1994 నాటికి ప్రపంచంలో అణ్వస్త్ర శక్తుల్లో ఉక్రెయిన్ మూడోస్థానంలో ఉండేది. ఇప్పుడా దేశం వద్ద ఒక్క అణుబాంబు కూడా లేదు.


గతంలో రష్యా, ఉక్రెయిన్ రెండూ సోవియట్ యూనియన్ లో భాగమే. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యాక ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. అయితే, తనకు రక్షణ కల్పిస్తుందన్న భరోసాతో 30 ఏళ్ల క్రితం తన వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉక్రెయిన్ దేశం రష్యాకు అప్పగించింది. ఈ వ్యవహారంలో అప్పట్లో అమెరికా, బ్రిటన్ మధ్యవర్తిత్వం వహించాయి.  

దీనిపై ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు అలెక్సీ గోన్ చెర్నెంకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "1991లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం తర్వాత వేలాదిగా అణ్వస్త్రాలు ఉక్రెయిన్ గడ్డపైనే ఉండిపోయాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు ఉక్రెయిన్ బుడాపెస్ట్ మెమొరాండంపై సంతకం చేసింది. దాని ప్రకారం ఉక్రెయిన్ పూర్తిగా అణ్వస్త్ర రహిత దేశంగా మారింది. అమెరికా, బ్రిటన్, రష్యా భద్రతాపరమైన హామీలు ఇవ్వడంతోనే నాడు ఆ నిర్ణయం తీసుకున్నారు. అణుబాంబులను తిరిగిచ్చేసిన దేశం ప్రపంచ చరిత్రలో ఉక్రెయిన్ ఒక్కటే అని గర్వించాం. కానీ, ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క అణ్వస్త్రం కూడా లేని మా దేశంపై రష్యా దాడికి తెగబడి, మా పౌరులను చంపేస్తోంది" అంటూ ఆ ఎంపీ వాపోయారు. "ఆనాటి ఒప్పందంలోని భద్రతా పరమైన హామీలు ఇప్పుడెక్కడ?" అని ఆయన ఆక్రోశించారు

No comments:

Post a Comment

LATEST POSTS

Numbers Expansion Form in English and Telugu

Numbers expansion form upto lakhs for both English and Telugu Number Expansion Tool English Telugu ...