ఏపీ పాలిసెట్
విజయవాడలోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్(ఎస్‌బీటీఈటీ) - పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్) 2022 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఎగ్జామ్‌లో సాధించిన ర్యాంక్ ఆధారంగా పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ/ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ ఇస్తారు.
అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు, ప్రస్తుతం పరీక్షలు రాసేవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.400
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్ 11 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 18
పాలిసెట్ 2022 తేదీ: మే 29
వెబ్‌సైట్: http://sbtetap.gov.in