మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు సంబంధించిన ఐదు ఆసక్తికర అంశాలను ఇక్కడ చూద్దాం.

1) అత్యంత చిన్న జిల్లా

2014లో ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉండేవి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలున్నాయి. ఇందులో ప్రకాశం, విజయనగరం తప్ప అన్ని జిల్లాలూ బ్రిటిష్ హయాంలో ఏర్పడ్డవే. పరిపాలనా సౌలభ్యం కోసం గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుంచి కొన్ని ప్రాంతాలతో 1970లో ప్రకాశం జిల్లా ఆవిర్భవించగా, 1979లో విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలతో విజయనగరం జిల్లా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటివరకు విజయనగరం అత్యంత చిన్న జిల్లాగా ఉండగా, ఇప్పుడు జిల్లాల విభజనతో ఆ స్థానంలోకి విశాఖపట్నం వచ్చింది.

2) గ్రామీణ ప్రాంతమే లేని జిల్లా

జిల్లాల విభజన తర్వాత- విస్తీర్ణం ప్రకారం చూస్తే 14,322 చ.కి.మీ. విస్తీర్ణంతో ఏపీలో పెద్ద జిల్లాగా ప్రకాశం, 928 చ.కి.మీ. విస్తీర్ణంతో విశాఖపట్నం చిన్న జిల్లాగా అవతరించాయి. జనాభా పరంగా చూస్తే 23.66 లక్షల జనాభాతో కర్నూలు మొదటి స్థానంలో ఉంది.

జిల్లాల విభజన తర్వాత- విశాఖపట్నం జిల్లా జనాభా 18.13 ల‌క్ష‌లు. ఈ జిల్లాలో అసలు గ్రామీణ ప్రాంతమే లేదు. విశాఖపట్నం జిల్లాలోని నగర ప్రాంతాన్ని విశాఖపట్నం జిల్లాగా, గ్రామీణ ప్రాంతాన్ని అనకాపల్లి జిల్లా, ఏజెన్సీ ప్రాంతాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లాగా విభజించారు. రాష్ట్రంలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా జనాభా 9.54 లక్షలు.

3) గిరిజన జిల్లాలు ఏవేవి?

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, ఉభయ గోదావరి జిల్లాల్లో గిరిజన ప్రాంతాలున్నాయి. గిరిజన సంక్షేమం కోసం ఈ జిల్లాల్లో ఎనిమిది ఐటీడీఏలు (సమీకృత గిరిజన అభివృద్ధి ఏజెన్సీలు) ఉన్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనుల కోసం ప్రత్యేకంగా జిల్లాలు లేవు. ఇప్పుడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల పేర్లతో రెండు గిరిజన జిల్లాలు ఏర్పడ్డాయి. వీటిని గిరిజనుల కోసం ఏర్పాటు చేస్తున్న జిల్లాలుగా ప్రభుత్వం చెబుతోంది. ఈ రెండు జిల్లాల్లో అత్యధికులు గిరిజనులే. పార్వతీపురం మన్యం జిల్లా పేరును తొలి నోటిఫికేషన్‌లో మన్యం జిల్లాగా ప్రభుత్వం ప్రకటించగా, దానిపై ఆందోళన జరగడంతో పార్వతీపురం మన్యం జిల్లాగా మార్చింది.

4) సముద్ర తీరం ఉన్న రాయలసీమ జిల్లా ఏది?

జిల్లాల విభజనతో రాయలసీమ ప్రాంత భౌగోళిక స్వరూపంలో ఒక ఆసక్తికర మార్పు వచ్చింది. ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాలే తీర ప్రాంత జిల్లాలు. వీటినే కోస్తా జిల్లాలంటారు. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో దేనికీ సముద్రతీరం లేదు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు ఇప్పుడు ఎనిమిది జిల్లాలవుతున్నాయి. అందులో ఒకటైన తిరుపతి జిల్లాకు ప్రస్తుత నెల్లూరు జిల్లాలోని తీరప్రాంతం కలిగిన సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని కలిపారు. దీంతో తిరుపతి జిల్లా పరిధిలోకి సముద్ర తీరం వచ్చింది. సూళ్లూరుపేట తో పాటుగా సముద్రతీరంలో ఉన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కూడా తిరుపతి జిల్లాలో కలుస్తోంది.

5) వ్యక్తుల పేర్లతో ఉన్న జిల్లాలెన్ని?

ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ప్రకాశం, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ జిల్లాలు వ్యక్తుల పేర్లతో ఉన్నాయి. ఇప్పుడు జిల్లాల విభజనలో- స్థానికంగా వచ్చిన డిమాండ్లతో వ్యక్తుల పేర్లతో మరికొన్ని జిల్లాలు వచ్చాయి.

రాష్ట్రంలో వ్యక్తుల పేరుతో ఏర్పడిన మొదటి జిల్లా ప్రకాశం. స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశంపంతులు సేవలను గుర్తిస్తూ 1972లో ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు.

తూర్పు కనుమల్లోని గిరిజనులకు అండగా నిలిచి...బ్రిటిషు వారిని ఎదిరించి మన్యం వీరుడిగా పేరు పొందిన అల్లూరి సీతారామరాజు పేరును ఎప్పటీ నుంచో విశాఖ జిల్లాకు పెట్టాలనే డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు విశాఖ మూడు జిల్లాలుగా విడిపోయింది. అందులో గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన జిల్లాను పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పేరిట ఏర్పాటు చేశారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) పేరు విజయవాడ కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు పెట్టారు.

ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటయ్యాయి.

మొత్తమ్మీద 26 జిల్లాలకుగాను ఏడు జిల్లాలకు వ్యక్తుల పేర్లు ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ప్రభుత్వం 2022 జనవరి 26న నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లాల పేర్లు, సరిహద్దులపై సలహాలు, అభ్యంతరాలు ఉంటే నెల రోజుల వ్యవధిలో తెలిపాలని సూచించింది. నెల రోజుల్లో 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు తెలిపారు.

వాటికి అనుగుణంగా మార్పులు, చేర్పుల విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి కలెక్టర్లు సమాచారం సేకరించారు. ప్రజల నుంచి వచ్చిన సలహాలు, అభ్యంతరాల మేరకు మన్యం జిల్లా పేరును పార్వతీపురం మన్యం అని, శ్రీ బాలాజీ జిల్లాను తిరుపతి జిల్లాగా మార్చారు. మిగతాదంతా దాదాపు తొలి నోటిఫికేషన్‌లో ఉన్నదే.

LATEST POSTS

Teachers Attendance, school attendance app updated version 2.2.6

స్టూడెంట్ టీచర్ attendence  App  2.2.6 వెర్షన్ కి update అయ్యింది. పాత యాప్ పనిచేయదు, Latest Teachers - Students Attendance  యాప్ 2.2.6 వెర్...