ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి బాగా లేదని మంత్రి పేర్ని నాని మరోసారి స్పష్టం చేశారు.
కొవిడ్ కారణంగా రాష్ట్ర తలసరి ఆదాయం దారుణంగా పడిపోయిందని పేర్కొన్నారు.
అయినప్పటికీ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు ఆటంకం లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని అన్నారు.
ఉద్యోగులకు పీఆర్సీ పెంపుదల విషయంలో గత్యంతరం లేకే ఉద్యోగులతో బేరాలు ఆడాల్సి వచ్చిందని వివరించారు.
పన్నుల వసూళ్లలో వాణిజ్య పన్నుల శాఖను చూసి ఐక్యంగా ఉండడం నేర్చుకోవాలని ఇతర శాఖలకు సూచించారు.
వైసీపీ అధికారంలోకి రావడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని, వారి మేలుకోసం అనేక రకాలుగా ఆదుకునే ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు.
ఉద్యోగులపై ప్రేమ లేకపోతే ఐఆర్ 27 శాతం ఎందుకు పెంచుతామని అన్నారు.
పీఆర్సీ బాలేదని కొందరు అంటున్నారు.
అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితే బాగాలేదని పేర్కొన్నారు.