దేశంలో పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది . లీటర్ పెట్రోల్పై రూ .8 , డీజిల్పై రూ .6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది . తాజా తగ్గింపుతో వినియోగదారులకు లీటర్ పెట్రోలుపై రూ .9.50 , డీజిల్పై రూ .7 మేర తగ్గుతుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు . తగ్గించిన ధరలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి .