పేద విద్యార్థులకు ' విద్యాదాన్ ' ఉపకార వేతనాలు
పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన పేద విద్యార్థులకు ' విద్యాదాన్ ' ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది .
ఇంటర్ చదివే వారికి ఏటా రూ . పది వేలు , ఆపై చదువులకు విద్యార్థి ప్రతిభ ఆధారంగా ఏటా రూ .60 వేల వరకు ఉపకార వేతనం ఇవ్వనున్నారు .
వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపున్న విద్యార్థులు www.vidyadhan.org లో దరఖాస్తు చేసుకోవాలి .
జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని , వివరాలకు ఫోన్ నంబర్ 8367751309 లేదా vidyadhan.andhra@sdfoundationindia.com ద్వారా సంప్రదించాలని కోరారు .