మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

తెలుగు భాషలో జంటపదాలు అనేకం ఉన్నాయి.వాటిలో కొన్ని జంట పదాలు మీ కోసం

జంట పదాలు ఇవి కొన్ని ద్వంద్వ సమాసములు.ఇల్లు వాకిలి, కట్టు బొట్టు, తోడు నీడ, పని పాట మొదలైనవి. ఇవి శుద్ధంగా ద్వంద్వ సమాసాలు అనడం కన్నా జంటపదాలు గానే పలుకుబడిలో ఉన్నాయి.ఎందుకంటే ఈ తెలుగు పదాలు సాధారణంగా వ్యప్తంగాకంటే సమస్తంగా ప్రయోగించటం విశేషం. తెలుగువాళ్ళు వీటిని జంటపదాలుగానే వాడతారు.


విభజన

ఈ జంట పదాలలో కొన్ని, రెండోపదం కూడా మొదటి పదం యొక్క అర్ధాన్నే ఇస్తూ మొదటి పదానికి వత్తాసుగా అంటె ఊతగా నిలబడుతుంది. సిగ్గు సెరము, ముసిలె మొతకన, బిడ్డ పాప మొదలైనవి లా. ఇవి జంటపదాలలో భాగమే. అందువల్లనే జంటపదాలను ద్వంద్వ సమాసాలనుంచి వేరు చేసి చెప్పడం జరుగుతుంది.

అలానే పరస్పర సన్నిహిత సంబంధం కలవి (ఇల్లు వాకిలి) జంటపదాలైతే, సమానార్ధక పదాలు ఊతపదాలవుతాయి. ఇవికాక మొదలైనవి(etc), తత్సంబంధమైనవి (and all) అనే తాత్పర్యంలో వచ్చే జంటపదాలు కొన్ని ఉన్నాయి. పురుగు పుట్ర, నగ నట్ర, కూర నార మొదలైనవి.వీటిని కూడా ఊతపదాలగానే అనటం బావుంటుంది.

ఇలానే మరికొన్ని పరస్పర విరుద్దమైనవి కూడా ఉన్నాయి.పెళ్ళి పెడాకులు, హీనం మానం, నీళ్ళు నిప్పులు మొదలైనవి ఈ రకానికి వస్తాయి.

జంటపదాలలో ముఖ్యంగా రెండోపదం యొక్క అర్ధం కాలక్రమంలో మరుగున పడిపోతున్నది.వాటి సహజ స్వభావం తెలియక, వ్యుత్పత్తి బోధపడక, అర్ధసామ్యం గుర్తురాక ఊతపదాలు చాలాభాగం వ్యర్ధంగా ఉపయోగించబడుతున్నది.


 కొన్ని జంటపదాలు


అంగడి-సంగడి- సంగడి అంటే స్నేహము. అంగడిన్ని స్నేహమున్ను పరస్పర సంబంధపదాలు


అంటు-సంటు- అంటరాని వస్తువు, తత్సంబంధము. అంటు-ముట్టు అని కూడా వాడుక.


అందం-చందం- ఊతపదాలు-చందం-అలంకరణ విధానం


అగ్గి-బుగ్గి- బుగ్గి-బూడిద


అచ్చట-ముచ్చట- అలంకారం-దానిపై కోరిక


అతుకు-బొతుకు- బొత్త-పాత్రలచిల్లి-అతుకు అనేమాటతో చేరి బొత్త, బొతుకు అయినది.


అరి-గురి- అరి-శత్రువు, గురి-శత్రువుమీది లక్ష్యం.


అల్లరి-చిల్లరి- చిలిపి చేష్టలు


అల్లి-బొల్లి- బొల్లి-అబద్దం చెప్పటం. ఆటల ధోరణి


ఆకు-అలము- అలము-శాకా విశేషము- ఆకూ అలమూ వేసి కూడ బెట్టాడు అనడం అలవాటు.


ఆర్చు-తీర్చు- బాధతొలగించుట.


ఆస్తి-పాస్తి- స్థిరమైన ఆస్థి-చరమైన ఆస్థి (గోడు గోద) అని అర్ధం.


ఇచ్చు-రొచ్చు- రొచ్చు-రొంపి, సంకటము. హీన స్థితి కు సంకేతం.


ఇరం-పరం- ఇహము పరము నుంచి వచ్చి యుండవచ్చును. లేక ఇరుగు-పొరుగు ఇట్లా భష్టమై వుండవచ్చును.


ఇరుగు-పొరుగు- ప్రక్కవాళ్ళు, సమీపస్థులు.


ఇల్లు-వాకిలి- ఇల్లు తత్సంబంధమైన వాకిలి.


ఈడు-జోడు- వయస్సుకు సంబంధించిన సమానత్వము.


ఉడుకు-మెడుకు- ఉడుకు-పరితపించు, మెడుకు- ఎక్కువ ఉడుకుట.


ఉరుకు-పరుగు- ఉరుకులు పరుగులు-తొందర


ఉలుకు-పలుకు- ఉలుకు-కదులుట. అదే ఉలకడు పలకడు.


ఊపర-దాపర- ఊబ- నపుంసకుడు, దాపరీడు-దొంగ.


ఎక్కా-ముక్కా- ఎట్లంటే అట్లు అని అర్ధం.


ఎడ్డి-మడ్డి- ఎడ్ది-బుద్ధి హీనత.


ఏండ్లు-పూండ్లు- పూండ్లు- అనేక సంవత్సరములు.


ఐసా-పైసా- అతో ఇటో తేల్చి వేయుట.


ఒడ్డు-పొడుగు- ఒడ్డు-స్థూలము, లావుపాటి.


కొంప- గోడి/గోడు- గోణి అంటె ఎద్దు. గోణి గోడి అయినది.అదే కొంపా గోడా.


కట్టె-కంప- కంప కూడ పెద్ద పొయ్యిలలోకి కట్టెలకి మారు పేరు.


కత్తి-కటారు- కటారి-కత్తి లేక పెద్దబాకు.


కధ-కమామీషు- కమామీషు-సంఘటనలు, వివరాలు.


కలి-గంజి- కలి (తమిళం) అంబలి, గంజి-అన్నంతో కూడినవార్పు నీరు.


కల్లి-బొల్లి- బొల్లి-ఒక చర్మరోగం. ఈ రోగం కలవాడు అబద్దాలు చెబుతాడని వాడుతారు.


కుమ్ము-దుమ్ము- కుమ్ములాడుకోవటం.


కూన-కురుజ- కురుజ్-చిన్నది. చిన్నవాళ్ళు అనే అర్ధం.


కూర-నార- నార-కూరమీద పీచు.


కూలి-నాలి- నాలి- చిన్నచూపు పని.


కోతి-కొండముచ్చు- కొండముచ్చు- అడవిలో తిరిగే నల్లమూతి కోతి.


గింజ-గిట్ర- గిట్ర-నగనట్ర లా అర్ధం చేసుకోవచ్చును.


చదువు-సంధ్య


చీకు-చింత- చీకు-నలత.


చీము-నెత్తురు- నెత్తురు-అభిమానానికి, చీము-అవమానానికి గుర్తు.


చిలువలు-పలువలు- చిలవ-నీరు కోడి, పలవ-చెట్టు పంగాలు. పరస్పరం సంబంధలేని విషయాలు అని అర్ధం.


చెట్టు-చేమ- చేమ- చేమగడ్డ.


చెత్త-చెదారం- చెదారం-తృణలేశము.


డబ్బు-దస్కం- దస్కం- చేవ్రాలు పెట్టిన విలువైన కాగితం.


తట్ట-బుట్ట- సర్దుకో అనిఅర్ధం.


తప్ప-దార- తప్పిపోయినట్లు అర్ధం.


తల-తోక- ఆద్యంతాలు లేని అభిప్రాయం.


తళుకు-బెళుకు- తళుకు-మిక్కిలి ప్రకాశము, బెళుకు- తళతళమని వెలుగు.


తీరు-దినుసు- దినుసు-ప్రకారం, విధము.


తెలివి-తేట- తెలివితేటలు.


తెప్ప-తేరు- ఉదా: దీపారాధన తప్ప తెప్పాలేదు, తీరూ లెదు.


తోడు-నీడ- నీడ-ఎల్లప్పుడు, వెంట


దిక్కు-దినాణం- ఉదా: దిక్కూ దివాణం లేనివాడవు


దేవుడు-దెయ్యం- వ్యతిరేకార్ధాలు తెలుపునవి.


నగ-నట్ర- ఉదా: నగ నట్ర చేయించాలి మరి!


నయీసు-నాగరికత- nice


నదురు-బెదురు- నదురు-కంటిభయం. ఎటువంటి భయంలేకపోవుట.


నీళ్ళు-నిప్పులు- ఉదా: నీళ్ళు నిప్పులూ ఇంకా చూసుకోలే!


నొప్పి-నోవి- నోవి (తమిళం) నొప్పి-.ఉదా: నొప్పి నోవి లేకుండ పడుకున్నాడు!


నోరు-వాయి- ఉదా: నోరు వాయి లేనివాడు పాపం.


పండగ-పబ్బం- పబ్బం-పండుగ.


పండూ-ఫలము- ఉదా: పండూ-ఫలము-ఏదీ పుచ్చుకోడు.


పని-పాట/పాటు- పని చెయ్యటము, చేస్తూ ఉత్సాహం కోసం పాడుకోవడం.


పరువు-ప్రతిష్ఠ- పేరు-ప్రతిష్ఠ.

LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...