ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరీక్షల విభాగం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
పరీక్ష కేంద్రాల్లోని సెల్ ఫోన్ ను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ అబ్జర్వర్లు, డిపార్మెంట్ అధికారులు, ఇన్వెజిలేటర్లు సైతం ఎగ్జామ్ సెంటర్లలోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు అధికారులు.
నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా సెల్ ఫోన్లను ఎగ్జామ్ సెంటర్లలోకి తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎగ్జామ్ సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు.
ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనుండగా.. విద్యార్థులను కేంద్రాల్లోకి ఉదయం 8.45 గంటల నుంచి 9.30 గంటల వరకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
ఇంకా.. విద్యార్థులు ఆన్సర్లు రాసేందుకు 24 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు. ఇది నిండిన తర్వాత అడిగే మరో 12 పేజీల బుక్ లెట్ ను అందించనున్నారు.
ఇంకా సైన్స్ పరీక్షకు 12 పేజీల బుక్ లెట్లు 2 ఇస్తారు. ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు ఒకటి, బయోలజీకి మరో బుక్ లెట్ ఇవ్వనున్నారు.