విద్యాప్రవేశ్ -9 వ రోజు తేదీ 24/06/2024 నాడు నిర్వహించవలసిన కృత్యాలు
Language & Literacy Development:-
పిల్లలతో వారి శరీర భాగాల పేర్లు చెప్పించడం. ఉదా: పిల్లలు కన్ను చూపిస్తూ కన్ను అని చెప్పాలి.
Cognitive Development:
విని గ్రహించి చెప్పండి:
పిల్లలకు కళ్లకు గంతలు కట్టి వివిధ ధ్వనులను వినిపించాలి గజ్జలు, మువ్వల సవ్వడి, గాజుల గలగల, వినిపించాలి. పుస్తకాల కాగితాలు తిరగవేయటం, చెప్పులతో నడవడం ఫ్యాన్ తిరుగుతున్న సౌండ్ మొదలైనవి గ్రుడ్డివారు చీకటిలో ఉన్నప్పుడు శబ్దాలను ఎలా గ్రహిస్తారో చర్చించాలి.
Physical Development:
గురి చూసి విసరడం టీచర్ క్లాస్ రూమ్ లో పిల్లలను వలయాకారంలో కూర్చోబెట్టి ఒక బాస్కెట్ కి ఎదురుగా కొంత దూరంలో నిలబెట్టి బంతిని ఇచ్చి విసరమనాలి. (ఆ బాస్కెట్ లో పడేలాగా)