శిక్షా సప్తాహ్ 6 వ రోజు న 27-07-2024 నిర్వహించవలసిన కార్యక్రమాలు.
టాస్క్ - 1
Ecoclubs ఏర్పాటు
శిక్షాసప్తాహ్ 6వ రోజు కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో Eco Clubs For Mission LiFe లను ఏర్పాటు చేయాలి.
ప్రతి క్లబ్ లోను HM కన్వీనర్ గాను, ఒక టీచర్ కోఆర్డినేటర్ గాను,ప్రైమరీ స్కూల్ అయితే 3-5 క్లాస్ పిల్లలు సభ్యులు గాను, UP స్కూల్ అయితే 5-8 క్లాసు పిల్లలు, హై స్కూల్ లో అయితే 8 లేదా 9 తరగతుల పిల్లలు 20-50 మందికి తక్కువ కాకుండా పిల్లలతో క్లబ్ ని ఏర్పాటు చెయ్యాలి
ఇందులో 6 sub teams ఉంటాయి ప్రతి team కి ఒక లీడర్ ని ఎంచుకోవాలి
1. Water
2. Waste Management
3. Energy
4. Land
5. Air
6. Food
కావున అందరూ Ecoclubs ఏర్పాటు చేసి వివరాలు మన జిల్లా వారు పంపిన గూగుల్ లింక్ ద్వారా పంపాలి.
అలాగే మన స్కూల్ ని www.greenschoolprogramme.org లో రిజిస్ట్రేషన్ చెయ్యాలి.
టాస్క్ - 2
Plant for mother
(అమ్మ పేరుతో ఒక మొక్క)
పిల్లలను ఒక్కో మొక్క తెమ్మని చెప్పి మన స్కూల్ ఆవరణలో గానీ లేదా ప్లేస్ లేకపోతే ప్రభుత్వ కార్యాలయం దగ్గర గానీ మొక్కలు నాటించాలి.
స్కూల్ ఆవరణలో ఉన్న మొక్కలను అంటే వృక్షాలు, ఆపస్ మొక్కలు, తీగ జాతులు వంటివి లెక్కపెట్టించడం.
మొక్కల చుట్టూ క్లీన్ చేసి నీరు పెట్టించడం.
కిచెన్ గార్డెన్ లేదా బడితోట( ఆర్గానిక్ ఫార్మ్) ఏర్పాటు
చెట్ల పేర్లను గుర్తు పట్టేలా చేయడం.
హై స్కూల్ వారు మొక్కల యొక్క కామన్ నేమ్, సైంటిఫిక్ నేమ్ బోర్డ్ పై రాయించవచ్చు.
బార్క్ ఆటోగ్రాఫ్స్ apus activity ( విభిన్న అకారాలలో ఉన్న పత్రాలను సేకరించి ప్రదర్శన చేయడం )
పత్రాలతో పెయింటింగ్ వేయించడం.( వాటికి ఇంకు పూసి ముద్రలు వేయించడం)
ప్రకృతి పరిరక్షణకు సంబంధించిన పాటలు పాడించడం, స్కిట్స్ వేయించడం.