విద్యాప్రవేశ్ 23 వ రోజు 10/07/2024 న 1వ తరగతి విద్యార్థులకు నిర్వహించవలసిన కృత్యాలు
Language & Literacy Development
పిల్లల చుట్టుపక్కల ఉన్న రకరకాల వస్తువుల గురించి వాటి పేర్లు చెప్పిస్తూ వాటిని ఎందుకు వాడతామో చెప్పించాలి.
ఉదా: కుర్చీ చూపిస్తూ ఇది ఏమిటి? అని అడగాలి. దీనిని ఎందుకు వాడతాం?
Cognitive Development
మునుగుట - తేలుట.
కృత్యం సహాయంతో మునుగుట, తేలుట వ్యత్యాసం తెలుసుకోవడం, కొన్ని వస్తువులను ఇచ్చి ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి నీళ్లలోమునిగినవి- తేలినవి గమనించమనాలి. ఎందుకు మునిగిందో, ఎందుకు తేలిందో చెప్పమనాలి. ఉదాహరణకు చిన్న రాయి ,చెక్కముక్క,బెండు,స్పాంజి, వంకాయ, బూర , నూనె, బియ్యం, మట్టి మొదలైనవి.
Physical Development
గీతపై, వంకరు టింకరు గీతపై, వృతంపై ఒకరిపై ఒకరు చేతులు వేసుకొని నెమ్మదిగా నడుచుట.