విద్యాప్రవేశ్ -56 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
పిల్లలతో వివిధ వాహనాలను శబ్దం చేస్తూ నడిపేలా అభినయం చేయించాలి.
Cognitive Development
ఎన్ని గ్లాసులు :- చిన్న చిన్న సమూహాలలో ఒక్కొక్క పెద్ద పాత్రను/మగ్ జగ్ ను ఇచ్చి నీరు/ఇసుక/మట్టి/బియ్యం/పప్పులను వేటినైనా గ్లాసుతో కొలిచి నింపమనాలి. ఏఏ సమూహాలలో ఎన్నెన్ని గ్లాసులతో నింపారో చర్చించాలి. ఎందుకు ఎక్కువ/తక్కువ గ్లాసులు పట్టాయో చర్చించాలి.
Physical Development
చేతి ముద్రలతో జంతువులు , పువ్వులు బొమ్మలు వేయుట :- పిల్లలు తెల్ల పేపర్ పై వారి చేతులను రంగులో ముంచి ముద్రలు వేయమనాలి. ఆ ముద్రలకు కళ్ళు , తోక , చెవులు పెట్టమనాలి.