3మరియు 5 తరగతుల 16 వ రోజు 17.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం.
తెలుగు
అమ్మ నాన్న చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య ఇలాంటి కుటుంబ సభ్యులను వివరించాలి. కుటుంబ సభ్యుల మమ్మల్ని చూపించి చిన్న వాక్యాల్లో వారి గురించి వివరణ ఇవ్వాలి ఉదాహరణకు ఈమె అమ్మ ఈమె మమ్మల్ని చూసుకుంటుంది అలాగే ప్రతి వ్యక్తిని పరిచయం చేస్తూ ఒకటి లేదా రెండు వాక్యాలు చెప్పాలి. అలాగే పిల్లలచే ప్రతి కుటుంబ సభ్యులపై రెండు వాక్యాలు రాయమని చెప్పాలి.
ఆట:
ఫ్యామిలీ ట్రీ పజిల్ ప్రతి విద్యార్థికి ఖాళీ కుటుంబ వృక్షం షీట్ ఇవ్వాలి. కుటుంబ సభ్యుల బొమ్మల కార్డులు లేదా పేర్ల కార్డులు ఇవ్వాలి విద్యార్థులు సరైన స్థలాల్లో వాటిని పెట్టాలి. ఒక్కో కుటుంబ సభ్యులపై ఒక వాక్యం మాట్లాడాలి ఉదాహరణకు ఈమె నా అక్క ఆమె నాకు కథలు చెబుతుంది అలాగా తమ కుటుంబం గురించి రాయమని చెప్పాలి.
ENGLISH
Numbers-vocabulary :
పిల్లలకు 1 నుంచి 10 వరకు అంకెలను విడిగా చెప్పాలి. మరల పిల్లల చేత చెప్పించాలి. తర్వాత వివిధ వస్తువులను లెక్కిస్తూ పిల్లలను కూడా చెప్పవనాలి. తర్వాత పిల్లలకు తరగతి గదిలో వివిధ వస్తువులు లేదా బొమ్మలు చూపించి వాటిని లెక్కించమని చెప్పాలి.
ఈ విధంగా ఎవరైతే 1 నుండి 10 వరకు అంకెలను చక్కగా చెప్పగలిగారో వారిని అభినందించాలి
Maths
Measuring time :
పిల్లలకు రాత్రి పగలు మరియు గడియారం గురించి అవగాహన కల్పించాలి. మార్నింగ్ అని చెప్పి వేకప్,బ్రేక్ ఫాస్ట్ లాంటి పదాలను ఉపయోగించాలి. అదేవిధంగా ఆఫ్టర్నూన్ అని చెప్పి స్కూల్ లంచ్ లాంటి పదాలు ఉపయోగించాలి. అదేవిధంగా రాత్రి అనే పదాన్ని చెప్పి డిన్నర్ స్లీప్ లాంటి పదాలను ఉపయోగించాలి. అలాగే పిల్లలను రోజులో వారి చేసేటటువంటి పనులను చిత్రం రూపంలో గీయమని చెప్పాలి. గడియారంలో వివిధ టైమ్స్ చూపిస్తూ ఆ టైం కి మీరు ఏం చేస్తారో చెప్పమనాలి. ఈ విధంగా ఎవరైతే పిల్లలు చక్కగా జవాబు ఇస్తారో వారిని చప్పట్లతో అభినందించాలి.