ఒక అడవిలో చాలా రోజులు వరుసగా ఎండలు కాసాయి. చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. ఒక కాకి దాహంతో ఎక్కడికక్కడ నీళ్లు వెతికింది, కానీ ఎక్కడా దొరకలేదు. దాహంతో అలమటిస్తూ చివరికి ఒక ఇంటి వద్దకు వెళ్ళింది.
ఆ ఇంటి మేడ దగ్గర ఒక కుండ ఉండగా, అందులో కొద్దిగా నీళ్లు మాత్రమే ఉన్నాయి. కాని ఆ నీళ్లు కుండ లోతులో ఉన్నాయి. చిన్న మెడ గల కాకి వాటిని తాగలేక మిక్కిలి ఆలోచించింది.తరువాత కాకికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది.
అక్కడ పడ్డ రాళ్లను ఒక్కొక్కటిగా తీసుకుని కుండలో వేసింది. కుండలో నీరు పైకి వచ్చింది. చివరికి నీళ్లు పైకి చేరి, కాకి తాగింది. తన తెలివితో ప్రాణాలు కాపాడుకుంది.