ఒక చిన్న గ్రామంలో తనుశ్రీ అనే బాలిక ఉండేది.ఆమె ఎంతో నిజాయితీ గలది. తన తల్లిదండ్రులకు సహాయం చేస్తూ ప్రతి రోజు పాఠశాలకు వెళ్ళేది.
ఒక రోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు తనశ్రీ కు రోడ్డుపై ఒక పర్సు కనిపించింది. దానిలో చాలా డబ్బులు,బ్యాంకు కార్డులు మరియు ఆధార్ కార్డ్ ఉన్నాయి.తనుశ్రీ ఆ పర్సును తీసుకుని వెంటనే గ్రామంలోని పెద్దవారికి చూపించింది.
గ్రామ పెద్దలు ఆ పర్సు యజమాని గురించి తెలుసుకుని, తనుశ్రీ ను ప్రశంసించారు. పర్సు యజమాని వచ్చి తనుశ్రీ కు ధన్యవాదాలు తెలిపి, ఒక చిన్న బహుమతిని ఇచ్చాడు. తనుశ్రీ మాత్రం “నేను చేసినది నా కర్తవ్యమే” అని వినమ్రంగా చెప్పింది.