ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక కాకి నివసించేది. ఎండాకాలం వచ్చింది, చెట్లు ఎండిపోయాయి, నీరు కూడా తగ్గిపోయింది. కాకి ఒక రోజ దాహంతో అలమటించింది. అది ఎక్కడికెళ్లినా నీరు కనబడలేదు. చివరకు ఒక ఇల్లు పక్కన ఉన్న కుండలో కొంచెం నీరు కనిపించింది.
కాకి చాలా ఆశతో కుండలోకి చూసింది, కానీ నీరు చాలా లోతుగా ఉంది. అది తాగలేకపోయింది. కొంతసేపు ఆలోచించి, చుట్టుపక్కల చూసింది. అక్కడ చిన్న రాళ్లు కనిపించాయి. అది ఒక రాయి తీసుకుని కుండలో వేసింది. ఆ నీరు కొంచెం పైకి వచ్చింది.
అది ఒక్కొక్క రాయి వేసుకుంటూ పోయింది. చివరికి నీరు పైకి చేరింది. కాకి సంతోషంగా ఆ నీటిని తాగింది. దాహం తీరింది. “తెలివిగా ఆలోచిస్తే కష్టమెంతైనా దాటవచ్చు” అని కాకి సంతోషంగా మనసులో చెప్పుకుంది."
No comments:
Post a Comment