సుదర్శన్ అనే చిన్న పిల్లాడు తన అమ్మతో కలిసి గ్రామంలో ఉండేవాడు. సుదర్శన్ కి చదువుకోవడం కంటే ఆడుకోవడం ఎక్కువగా నచ్చేది. ప్రతిరోజూ ఆడకుంటూ పాఠశాలకు ఆలస్యంగా వెళ్లేవాడు.
ఒక రోజు గురువు గారు సుదర్శన్ ను పిలిచి, “చదువు చాలా ముఖ్యమైనది, నువ్వు నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి మనిషివి అవుతావు” అని చెప్పారు. ఆ మాటలు సుదర్శన్ మనసుకు తగిలాయి.
ఆ రోజు నుండి సుదర్శన్ క్రమంగా చదవడం మొదలుపెట్టాడు. కొద్ది రోజులకే పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. గురువు గారికి ధన్యవాదాలు చెప్పి, ఇకపై బాగా చదవాలని నిర్ణయించుకున్నాడు.
No comments:
Post a Comment