లాక్ డౌన్ ఆలోచనే లేదు. నిర్మలా సీతారామన్
భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంటుందని పుకార్లు ఎక్కువయ్యాయి . అయితే తాజాగా దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు . మళ్లీ లాక్ డౌన్ విధించే ఆలోచనే కేంద్రానికి లేదని స్పష్టం చేశారు . కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో .. అక్కడి ప్రభుత్వాలు , అధికారులే నియంత్రణా చర్యలు చేపడతారని , కఠిన ఆంక్షలు సైతం అమలు చేస్తారని తెలిపారు