విజయనగరం జిల్లా కొత్తవలసలోని ఓ పాఠశాలలో ఒకేరోజు 20 కరోనా కేసులు బయటపడ్డాయి. సోమవారం ఆ పాఠశాలలో 120 మందికి పరీక్షలు నిర్వహించగా.. మంగళవారం వచ్చిన ఫలితాల్లో 19 మంది విద్యార్థులతోపాటు, ఒక ఉపాధ్యాయునికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో పాఠశాలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా మరో 65 మందికి పరీక్షలు చేశారు. విశాఖపట్నం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారికి కొవిడ్ వైరస్ సోకింది. మంగళవారం ఆయన కలెక్టర్ నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు.