మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9490371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

దేశంలో కరోనా రోజువారీ కేసులు 3 లక్షలు దాటేశాయ్.24 గంటల్లోనే భారీగా నమోదైన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. రోజువారీ కేసులు 3 లక్షల మార్కును దాటేశాయి. నిన్న ఒక్కరోజే 3,17,532 మంది మహమ్మారి బారిన పడ్డారు. ఇది 249 రోజుల గరిష్ఠం కావడం గమనార్హం. 19,35,180 టెస్టులు చేయగా.. పాజిటివిటీ రేటు 16.41 శాతంగా ఉంది. నిన్నటితో పోలిస్తే పాజిటివిటీ రేటు ఒక శాతం పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేటు 16.06 శాతంగా నమోదైంది.

 ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులున్నాయి. కాగా, కరోనాతో మరో 491 మంది మరణించారు. నిన్న 2,23,990 మంది కోలుకోగా.. మొత్తం 3,58,07,029 మంది రికవర్ అయ్యారు. రికవరీ రేటు 93.69 శాతం. ఒమిక్రాన్ కేసులు 9,287కి పెరిగాయి.

ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే, ఇప్పటివరకు 159,67,55,879 డోసుల టీకాలను వేశారు. నిన్నటివరకు 15 నుంచి 18 ఏళ్ల మధ్య ఉన్న 3.8 కోట్ల మంది టీనేజర్లకు టీకాలు వేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో 73 లక్షల డోసుల టీకాలను జనానికి వేసినట్టు తెలిపింది. మొత్తంగా ఇప్పటివరకు 61 లక్షల డోసుల ప్రికాషనరీ టీకాలను ఇచ్చామని వెల్లడించింది. రాష్ట్రాలకు 158,96,34,485 డోసుల టీకాలను ఇవ్వగా.. ఇంకా రాష్ట్రాల వద్ద 12,72,19,636 డోసులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది

No comments:

Post a Comment

LATEST POSTS

SRVKM App updated latest version 1.8.8 07-01-2026

సర్వే పల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర యాప్ అప్డేట్  లేటెస్ట్ వెర్షన్ 1.8.8 కు అప్డేట్ అయింది. https://play.google.com/store/apps/details?id...