మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

రాష్ట్ర బడ్జెట్ ఉద్యోగాల వ్యయం చాలా ఎక్కువ : సీఎస్ సమీర్ శర్మ

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు . ప్రభుత్వం ఇచ్చిన జీవోలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టారు . జీవోల వ్యవహారంపై సమ్మెకు సైతం సిద్ధమని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి . ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది . ఉద్యోగుల పీఆర్సీ , ఇతర అంశాలపై సీఎస్ సమీర్ శర్మ వివరణ ఇచ్చారు . సీఎస్ మాట్లాడుతూ .. " రాష్ట్రంపై కరోనా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది . రాష్ట్రానికి రూ . 62 వేల కోట్ల రెవెన్యూ ఉంది . కరోనా లేకపోయి ఉంటే రాష్ట్ర రెవెన్యూ రూ . 98 వేల కోట్లు ఉండేది . కొవిడ్ మహమ్మారి కారణంగా రాష్ట్ర రెవెన్యూ పడిపోయింది . గత పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది . ఒమిక్రాన్ కారణంగా రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావం పడింది . రాష్ట్ర బడ్జెట్లో ఉద్యోగుల వ్యయం చాలా ఎక్కువ .

ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగులు , సంక్షేమ పథకాలకు ఎలా ఇవ్వాలనేది ప్రభుత్వం ఆలోచించాలి . రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే ప్రభుత్వ కర్తవ్యం . రాష్ట్ర బడ్జెట్లో పీఆర్సీతో పాటు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది . విద్య , సంక్షేమం , మౌలిక సదుపాయాలు , ఇతరత్రా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది . రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాం . ఆర్థికంగా రాష్ట్ర స్వరూపమే మారిపోయింది . రాష్ట్ర పరిస్థితులు దిగజారిపోయాయి . కరోనా వేళ ఇతర రాష్ట్రాలు సంక్షేమ పథకాలు తగ్గించాయి . సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించాం . ఉద్యోగులు , పింఛనర్లు అందరికీ ప్రభుత్వం న్యాయం చేసింది . రాష్ట్రానికైనా , కుటుంబానికైనా ఆర్థిక వనరుల వినియోగం ఒకేలా ఉంటాయి . పరిమితంగా ఉన్న వనరుల వినియోగంలో సవాళ్లు ఉంటాయి . ఉద్యోగులు , సంక్షేమం సహా అన్ని రంగాలకు ఆర్థిక వనరులు పంచాలి . కొవిడ్ వేళ చాలా రాష్ట్రాలు సంక్షేమ బడ్జెట్లో కోతపెట్టాయి . ఏపీలో సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్నాం . విభజన నుంచి కరోనా వరకు ఆర్థిక వనరులు ఒడిదుడుకుల్లో ఉన్నాయి . పరిశ్రమలు , సర్వీసుల రంగం ఒడిదుడుకులకు లోనైంది . ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . అందరికీ న్యాయం జరిగిందనే అనుకుంటున్నాం ” అని సీఎస్ వివరించారు

ఐ.ఆర్. అనేది జీతంలో భాగం కాదని గమనించండి.పిఆర్సి ఆలస్యం అవుతుందని ఐఆర్ ఇవ్వడం జరిగింది.

ప్రకటించిన  డీఏ లు అన్నీ కలిపి చూడండి... గ్రాస్ శాలరీ లో ఏ ఒక్క ఉద్యోగికీ జీతం తగ్గలేదు..

*కోవిడ్ వల్ల ఆదాయం చాలా తగ్గిపోయింది. కోవిడ్ లేకపోతే 98 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేది.

LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...