రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పేద విద్యా ర్థులకు 25 శాతం సీట్లు కేటాయించే దుకు సంబంధించిన విద్యా హక్కు చట్టం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం 12 ( 1 ) ( సి ) నిబంధనను సోమవారం తీసుకుందని పాఠశాల విద్యా శాఖ కమిష నర్ కె . సురేష్ కుమార్ చెప్పారు . ఆయన విద్యా హక్కు చట్టం రాష్ట్ర కమిటీ చైర్మన్ బుడితి రాజశేఖర్ , సభ్యులు , ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ప్రతినిధులు , ఎన్జీవోలతో సమావేశ మయ్యారు . 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఈ చట్టాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున .. ఆ దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు . ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టం 12 ( 1 ) ( సి ) ని తప్పకుండా చేసేందుకు ప్రైవేటు పాఠశాలల అసోసి యేషన్ ప్రతినిధులు , ఎన్జీవోలు అంగీకరిం చినట్లు కమిషనర్ తెలిపారు . ఒక్కో విద్యార్థికయ్యే ఖర్చుకు సంబంధించిన నిర్ణయాలపై కమిటీ కూలంకషంగా చర్చలు జరిపిందని మీడియాకు చెప్పారు . సమావేశంలో సమగ్ర శిక్షా రాష్ట్ర సంచాల కులు కె.వెట్రిసెల్వి తదితరులు పాల్గొన్నారు .