మీకు కావలసిన సమాచారం కోసం సెర్చ్ చేయండి

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9494808525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; MDM SOFTWARE ; CCE 1TO 5TH SOFTWARE ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ వార్తా చానెల్స్

జగనన్న అమ్మఒడి కి అర్హత పొందని వారు వెంటనే క్రింద ఇచ్చిన సూచనలు పాటించండి

జగనన్న అమ్మఒడి జాబితాలు గ్రామ సచివాలయముల నందు డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్పేర్ అండ్ ఎడ్యూకేషన్ అసిస్టెంట్ల వద్ద అందుబాటులో ఉన్నవి.వారిని సంప్రదించి 

(1) మొదటి జాబితాలో యాక్టివ్(Active),  ఇన్ ఆక్టివ్ (Inactive) అని రెండు లేనివారు (Empty box),

(2) Ineligible/ Reverification నందు Six step validation లో అనర్హత పొందిన వారు తమ దగ్గరున్న ఆధారాలతో వారు అమ్మ ఒడికి  అర్హులైనట్లయితే,

(3) పాఠశాలలో పేరు ఉండి ప్రభుత్వం విడుదల చేసిన అమ్మ ఒడి ఏ జాబితాలో కూడా పేరు లేని వారు,

"అమ్మ ఒడి గ్రీవెన్స్ అప్లికేషన్ ఫార్మ్" ను పూర్తి చేసి ఆ ఫార్మ్ గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ మరియు వెల్ఫేర్ అండ్ ఎడ్యూకేషన్ అసిస్టెంట్ లకు సమర్పించవలెను.వారు వారికి ఇచ్చిన లాగిన్ నందు సరిచేస్తారు.ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి చివరి తేది: జూన్ 5, 2022.

అమ్మఒడి Grievances:

☛ అమ్మఒడి status check చేసుకోని grievance పెట్టడానికి అవకాశం  beneficiary management New అనే ఆప్షన్ ఇవ్వడం జరిగింది.

Grievances ఎవరికీ పెట్టాలి అంటే.

☛ తల్లి / విద్యార్థి / సంరక్షకుడు ఆధార్ నెంబర్ తప్పు గా ఉన్నపుడు,

☛ విద్యార్థి / తల్లి కి అసలు రైస్ కార్డు లేకపోయినా 

☛ విద్యార్థి / తల్లి ఒకే house హోల్డ్ mapping లేకపోయినా ,

☛  విద్యార్థి / తల్లి అసలు హౌస్ హోల్డ్ mapping లో లేకపోయినా,

☛ విద్యార్థి / తల్లి ఒకే రైస్ కార్డు లో లేకపోయినా,

☛ గవర్నమెంట్ employee ( ఒకవేళ ఇలాంటి names వస్తే ),

☛ విద్యార్థి / తల్లి తప్పుగా mapping చేయబడిన..,

☛ Age , caste , electricity , four wheeler , gender etc.. ఈ ఆప్షన్స్ నుంచి మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకొని grievance raise చేసుకోవచ్చు.

AMMAVODI అర్హుల జాబితాలో  బ్యాంక్ అకౌంట్స్ ఆక్టివ్ , ఇనాక్టివ్  నందు ఇనాక్టివ్ ఉన్న వారు బ్యాంక్ కు  వెళ్లి ఆక్టివేట్ చేసుకోని NPCI చేసుకోగలరు.

👉గత రెండు సంవత్సరములు అమ్మఒడి పథకం డబ్బులు మీరు మీ యొక్క  బ్యాంకు అకౌంట్ వివరాలు స్కూల్ ఇచ్చేవారు , వాటినే  స్కూల్ లాగిన్ లో ENROLL చేసేవారు, ఆ బ్యాంకు అకౌంట్ లో డబ్బులు పడేవి.

👉కానీ ఈ సంవత్సరం ఆలా కాదు. NPCI కి లింక్ అయిన బ్యాంకు అకౌంట్ లో మాత్రమే అమ్మఒడి డబ్బులు పడతాయి. NPCI అనగా NATIONAL PAYMENT CORPORATION OF INDIA. 

👉బ్యాంకు అకౌంట్ NPCI కి LINK చేయటమంటే  బ్యాంకు అకౌంట్ ఆధార్ తో లింక్ చేయబడి ఉండటమే. ఆధార్ తో లింక్ చేయబడిన ప్రతి ఒక్కరి ఒక అకౌంట్ ఇప్పటికే మన ప్రమేయం లేకుండానే NPCI కి LINK చేయబడే ఉంటుంది.

 ఇక్కడ ఒక అకౌంట్ అనేది గమనించాల్సిన విషయం.

 ఒక వ్యక్తికీ మూడు లేదా నాలుగు బ్యాంకు అకౌంట్ లు ఉంటే వాటిలో ఒక బ్యాంకు అకౌంట్ మాత్రమే NPCI కి లింక్ అయి ఉంటుంది. మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏది NPCI కి లింక్ అయి ఉంది అనే విషయం మనకు తెలిసి ఉండాలి. ఎలా తెలుసుకోవాలి అనేది క్రింద వివరించటం జరిగింది.

👉మనకు ఉన్న బ్యాంకు అకౌంట్ లలో ఏ అకౌంట్ NPCI కి లింక్ అయి ఉంది, దానినే స్కూల్ లో ఇచ్చామా లేక వేరేది ఇచ్చామా అనేది సరి చూసుకోవాలి. రెండు ఒకటే అయితే సరే అమ్మఒడి డబ్బులు వస్తాయి. రెండు వేరు వేరుగా ఉన్నాయి అంటే అమ్మఒడి డబ్బులు రావు.రెండు ఒకటే ఉండేలా అటు బ్యాంకు లో అయినా లేదా ఇటు స్కూల్ లో అయినా మార్చుకోవాలి.

👉ఒక PARENT ఒక బ్యాంకు లో మాత్రమే అకౌంట్ ఉంది అనుకుందాం. ఒక అకౌంట్ మాత్రమే ఉంది. అది ఆధార్ లో లింక్ అయి ఉంది. కాబట్టి NPCI కి కూడా లింక్ చేయబడి ఉంటుంది . దానినే స్కూల్ లో ఇచ్చి ఉంటారు . దానిలోనే అమ్మఒడి డబ్బులు పడతాయి . ఇక్కడ ఏ సమస్యా రాదు.

👉మరొక PARENT కి మూడు బ్యాంకులలో అకౌంట్ లు ఉన్నాయి అనుకుందాం. ఉదాహరణకు 1.UNION BANK,

 2.SBI, 

3.BANK OF INDIA అనుకుందాం. వీటిలో ఏది NPCI కి  లింక్ అయి ఉందో అని CHECK చేస్తే SBI చూపిస్తుంది అనుకుందాం. కానీ స్కూల్ లో BANK OF INDIA అకౌంట్ వివరాలు ఇచ్చారు అనుకుందాం. ఇక్కడ సమస్య వస్తుంది. BANK OF INDIA లో డబ్బులు పడవు. SBI లో మాత్రమే పడతాయి. గత రెండు సంవత్సరాలు BANK OF INDIA లోనే డబ్బులు పడి నప్పటికీ ఈ సంవత్సరం పడవు.

👉ఇప్పుడు PARENT కి రెండు OPTIONS ఉంటాయి.

👉మొదటి OPTION , SBI అకౌంట్ వాడుకలో ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ చాలా రోజులు వాడక INACTIVE లో ఉంటే ACTIVE చేయించాలి.  మరియు స్కూల్ లో BANK OF INDIA కి బదులుగా SBI అకౌంట్ వివరాలు ఇచ్చి BANK OF INDIA వివరాలు తీసేసి SBI అకౌంట్ వివరాలు ENROLL చేయమని స్కూల్ వారిని అడగాలి.

👉రెండవ OPTION : SBI లో పడడానికి వీలులేదు మాకు ఎప్పటి లాగానే  BANK OF INDIA లోనే పడాలి అంటే , BANK OF INDIA బ్యాంకు కు వెళ్లి అకౌంట్ ని  NPCI కి లింక్ చేయమని బ్యాంకు వారిని అడగాలి.

👉ఇలా NPCI లింక్ అయిన బ్యాంకు అకౌంట్ మాత్రమే స్కూల్ లో ENROLL అయి ఉండేలా చూసుకొనగలరు.

అమ్మఒడి అర్హత మరియు రీవెరిఫికేషన్‌ జాబితా రెండింటిలోనూ లబ్ధిదారు పేరు లేకుంటే ఏమి చేయాలి?

 2021 - 2022  విద్యా సంవత్సరం 1 నుండి 12 వ తరగతి వరకు చదువు పిల్లలు అమ్మఒడి ఎలిజిబుల్ లిస్టులో లేకున్నా, అటువంటి పిల్లల తల్లితండ్రలు వారి గ్రామా సచివాలయాన్ని సంప్రదించగలరు.గ్రామసచివాలయం ద్వారా గ్రీవెన్స్ రైజ్ చేయగలరు .

➡️ ముందుగా చైల్డ్ IDతో BOP లో చెక్ చేయండి. అందు పేరు అందుబాటులో ఉంటే బిడ్డ మరియు తల్లి ఇద్దరి  ఆధార్ నమోదు చేసి  eKYC పూర్తి చేయాలి. 

BOP నందు  బిడ్డ పేరు లేకపోయినా సదరు బిడ్డ అర్హత కలిగి ఉంటే NBMలో

  "Child is eligible but details not 

found in both lists"

 విభాగం నందు ఫిర్యాదు నమోదు చేయాలి.

LATEST POSTS

Vidya pravesh day 34 activities for primary

విద్యాప్రవేశ్ -34 వ రోజు 27/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు  Language & Literacy Development  ఫ్లాష్ కార్డ్స్ లేదా...