ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)ల కింద చెల్లించాల్సిన వార్షిక ప్రీమియం జూన్ 1 నుంచి పెరగనుంది. ఈ రెండు పథకాలు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.20కి పెంచారు. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ రెండు పథకాలను ఆర్థికంగా లాభదాయకంగా మార్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి జీవనజ్యోతి యోజన కింద 6.4 కోట్ల మంది, సురక్ష బీమా యోజన కింద 22 కోట్ల మేర చందాదారులు చేరారు. ఈ పథకాలను మొదలుపెట్టిన నాటి నుంచి ‘సురక్ష’ కింద ప్రీమియం కింద రూ.1,134 కోట్లు వసూలు చేసి, క్లెయిమ్‌ల రూపంలో రూ.2,513 కోట్లు చెల్లించినట్లు ఆర్థికశాఖ తెలిపింది. ‘జీవనజ్యోతి’ కింద రూ.9,737 కోట్లు వసూలు చేసి రూ.14,144 కోట్ల క్లెయిమ్‌లు అందజేసినట్లు వెల్లడించింది. 2015లో ఈ రెండు పథకాలను ప్రారంభించి.. చెల్లింపులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఏడేళ్లపాటు ఏటా నష్టాలు వస్తున్నప్పటికీ ప్రీమియంను మాత్రం పెంచలేదని ఆర్థికశాఖ పేర్కొంది. ఇప్పుడు ప్రీమియంను పెంచడం ద్వారా ఈ పథకాల అమలుకు ప్రైవేటు కంపెనీలనూ ఆహ్వానించడానికి వీలవుతుందని తెలిపింది. ఫలితంగా పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేయడానికి వీలవుతుంది.
Pages
Subscribe to:
Post Comments (Atom)
LATEST POSTS
English Story 17 with 5 questions and options for education
English Education Paragraph ను చదివి క్రింది ఇచ్చిన 5 ప్రశ్నలకు సమాధానాలను సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే correct, wrong answer చూపిస్తుంది. అ...
No comments:
Post a Comment