నవోదయ ఆరవ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. నవోదయ ప్రవేశాలకు దరఖాస్తు జనవరి 31 వరకే గడువు
ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
పుట్టిన తేది :01-05-2011 నుండి 30-04-2013 ( మొదటి మరియు చివరి రోజులు కలుపుకొని ఉండాలి. )
Apply చేయడానికి చివరి తేది :31-01-2023
పరీక్ష తేది : 29-04-2023
Apply చేయడానికి కావాల్సినవి
Student ఫోటో
JNVcertificate attested by HM
Student sign
Parent sign
Student Adhar number
Mobile number
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక విద్యను అందించే జవహర్ నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తులను కోరడంతో సం దడి మొదలైంది. విద్యతోపాటు కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం తో కూడిన విద్యను నవోదయలో అందిస్తున్నారు. ఇక్కడ చదువుకున్న ఎంతో మంది ఐపీఏఎస్, ఐఏఎస్ వంటి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడితే, మరెందో విదేశాల్లో ఉన్నతస్థాయిలో ఉన్నారు. నవోదయకు మంచి పేరు, ప్రతిష్ఠలు ఉండడంతో ఐదో తరగతి చదివిన విద్యార్థులు, ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రతీ సంవత్సరం నవోదయలో చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రభుత్వం ఇవ్వడంతో అర్హత కలిగిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
ప్రవేశానికి అర్హతలు
విద్యార్థులు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన పాఠశాలలో 3, 4, 5 తరగతులు చదివి ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. సంబం ధిత ప్రధానోపాధ్యాయుడు జారీ చేసిన ధ్రువీకరణ పత్రం జతపర్చాచాలి. విద్యార్థి 2011 మే 1 నుంచి 2013 ఏప్రిల్ మధ్య జన్మించి ఉండాలి. పరీక్షకు ప్రశ్న పత్రం మూడు విభాగాలుగా ఉంటుంది. ప్రతీ విభాగంలో లఘు జవా బులు (ఆబ్జెక్టివ్ టైప్) ఉంటాయి. వంద మార్కులకు గాను 80 ప్రశ్నలుంటాయి.2 గంటల వ్యవధిలో పరీక్ష రాయాల్సి ఉంటుంది. పరీక్ష పేపర్ జన రల్ నాలెడ్జ్ లో 40 ప్రశ్నలు ఉండగా, 50 మార్కులు ఉంటాయి. 60 నిమి షాల సమయం ఉంటుంది. గణితంలో 20 ప్రశ్నలు ఉండగా, 25 మార్కులు ఉంటాయి. 30 నిమిషాల సమయం ఉంటుంది. తెలుగులో 20 ప్రశ్నలు ఉండగా, 25 మార్కులు ఉంటాయి.30నిమిషాల సమయం ఉంటుంది.