తల్లికి వందనంకింద ప్రతి విద్యార్థికి రూ.15వేలు. ఆదేశాలు జారీ చేసిన సీఎస్ కోన శశిధర్
తల్లికి వందనం కొన్ని అర్హతలు మరియు డైరెక్ట్ గా ఖాతా నందు జమ చేయుటకు ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలని ఉత్తర్వులు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.
ఏడాదికి 15,000 తల్లి అకౌంటు నందు జమ
BPL కుటుంబాలలో 1 నుండి 12 వ తరగతి పిల్లల తల్లులకు
75% అటెండన్స్ తప్పనిసరి.
తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఒకటి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 15 వేలు చొప్పున విద్యార్థుల తల్లులకు అందజేయనున్నారు. ఈ మేరకు అర్హులైన విద్యార్థి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వ కార్య దర్శి కోన శశిధర్ ఆదేశాలు జారీ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిచాలని ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
తల్లికి వందనం, స్టూడెంటకిట్పథకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి అందేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశిచారు.
అర్హులైన ప్రతి విద్యార్థి తల్లులకు ఒకో విద్యార్ధికి సంవత్సరానికి రూ 15 వేలు చొప్పున అందిం చాలని ఆదేశించారు. అలాగే స్టూడెంట్ కిట్ కింద టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, మూడు జతల యూనిఫాం, కుట్టు చార్జీలు, షూ, బెల్టు, స్కూల్ బ్యాగు, డిక్షనరీ ప్రతి విద్యార్థి కి అందించాలని ఆదేశించారు. తల్లికి వందనం పథకం కింద అర్హులైన విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారై ఉండాలన్నారు. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉండాలన్నారు. ఆధార్ కార్డు నెంబరు ఆధారి తంగా అర్హుల నమోదు ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన విద్యార్థుల తల్లులు బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, రేషన్ కార్డు లేదా ఓటరు ఐడి కలిగి ఉండాల న్నారు. తల్లి బ్యాంక్ అకౌంట్లో ఏడాదికి రూ.15 వేలు జమ చేయనున్నారు. నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేయడానికి ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసి ఉండాలని తెలిపారు.