విద్యాప్రవేశ్ -26 వ రోజు 15/07/2024 న 1వ తరగతి విద్యార్థులతో చేయించవలసిన కృత్యాలు
Language & Literacy Development
Alphabet Picture Reading A, B, C (use flash cards or BLOSSOMS-1)
Cognitive Development
ముందు- వెనుక- మధ్య
వృత్తాలలో పిల్లలను నడిపిస్తూ మ్యూజిక్ ఆగినప్పుడు టీచర్ కు ఎదురు ఉన్న విద్యార్థి తమ ముందు ,వెనుక, మధ్య ఎవరున్నారో వారి పేర్లు చెప్పమనాలి.
వస్తువులను/ పండ్లను /బొమ్మలను పేర్చుతూ ముందు వెనుక మధ్యలో ఉన్నదానిని చెప్పమనాలి. 0-9 అంకెలను ముందు మధ్య వెనుక ఉన్న అంకెలను గుర్తించమని చెప్పాలి.
Physical Development
పేపర్ వాక్
ఒక్కో విద్యార్థికి రెండు కాగితం ముక్కలు ఇవ్వాలి. (పిల్లలు వాటిపై నిలబడడానికి వీలుగా ఉండాలి). ముందుగా ఒక కాగితం నెల పై వేసుకుని ప్రారంభ గీతదగ్గర నిలబడాలి. తరువాత రెండో కాగితాన్ని ముందుకు వేసుకొని ఆ కాగితంపై నిలబడాలి. ఇప్పుడు ముందు నిలబడిన కాగితాన్ని తీసుకొని ముందు వైపు పరుచుకోవాలి. తరువాతి అడుగు దానిపై వేయాలి. Sఇలా నడుస్తూ అంత్య గీత వరకు వెళ్ళేలా చేయాలి.