విద్యాప్రవేశ్ -55వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
వివిధ వాహనాల కార్డులను పిల్లలకు ఇచ్చి బృందాలుగా విభజించి వారికి అందిన కార్డులు ఆధారంగా చిన్న కథను సొంతంగా చెప్పమనాలి. పిల్లలను సొంతంగా కథ చెప్పేందుకు వీలుగా ప్రోత్సహించాలి.
Cognitive Development
పిల్లలను పెద్ద సమూహంలో గుండ్రంగా నిలబడమనాలి. ఒక పిల్లవాడు చుట్టూరా పరిగెడుతూ రుమాలు ఒక విద్యార్థికి ఇస్తూ పరిసరాలలో కనిపించే ఒక వస్తువు పేరు చెప్పాలి . రుమాలు తీసుకున్న విద్యార్థి దానివి కనిపెట్టి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్లి లెక్కిస్తూ దానిని చూపాలి. (ఉదాహరణకు ఎనిమిది అడుగులు అని చెప్పాలి)
Physical Development
టీచర్ ఒక పిల్లవాడిని నేలపై పడుకోమని మరొక పిల్లవాడితో శరీర ఆకారాన్ని చాక్ పీస్ తో గీయమని కొంతమందిని బాడీ పార్ట్ లో ఆకారాలు గుర్తించమనేలా ఆట ఆడించాలి. ఉదాహరణకు తల, కాళ్లు, చేతులు మొదలైనవి.