విద్యాప్రవేశ్ -53 వ రోజు 1వ తరగతి విద్యార్థుల కృత్యాలు
Language & Literacy Development
పిల్లలు రోజు స్కూల్కి ఎలా వస్నుతున్నారో మాట్లాడించాలి. వారి ఇంట్లో ఉండే వాహనాల గురించి మాట్లాడించాలి. సైకిల్ తొక్కడం వచ్చిన పిల్లలతో వారి అనుభవాలు చెప్పించాలి( మూడుచక్రాల సైకిల్ లేదా పిల్లల సైకిల్). వారికి తెలిసిన వాహనాల పేర్లు చెప్పించాలి.
Cognitive Development
లెక్కించడం,పోలిక:-
జట్లుగా'పిల్లల్ని కూర్చోబెట్టి ఒక్కొక్కరి 10 లోపు ఒక్కొక్క నెం. కార్డు / నెం. బొమ్మ ఇవ్వాలి. జట్టు లోని ఇద్దరు విద్యార్థులు ప్రక్కన విద్యార్థి అంకెతో పోల్చుకొని తన నెం. కంటే తన నెంబరు పెద్దదో /చిన్నదో మరియు ఎంత తేడానో చెప్పాలి. ఈ కృత్యం కోసం చిన్న చిన్న వస్తువులను వాడుతూ పెద్ద చిన్న అవగాహన కలిగించ వచ్చు._
బోర్డు మీద రాయాలి.
A B A B
(5) (3) (5) > (3)
5, 3 కంటే 2 అంకెలు పెద్దది. అనీ,
(3) < (5)
3, 5 కంటే 2 అంకెలు చిన్నది అని చెప్పాలి.
Physical Development
మ్యూజికల్ నెంబర్స్ :-టీచర్ వృత్తాన్ని గీసి దానిలో ఒకటి నుంచి పది అంకెలు రాసి పిల్లలను చుట్టూ తిరగమంటూ, చెప్పిన అంకె మీదకు దూకమనాలి.