3 మరియు 5 తరగతుల 12వ రోజు 011.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం.
తెలుగు
పాప పాఠశాలకు వెళ్లింది లాంటి సరళమైన వాక్యాలు చెప్పాలి. బొమ్మను చూపించి దానికి సంబంధించిన వాక్యాన్ని శబ్ద పూర్వకంగా రూపొందించాలి బోర్డు మీద రాయడం ద్వారా పిల్లలకి స్పష్టత కలిగించాలి. బొమ్మను పరిశీలించి దానికి తగిన వాక్యాన్ని తయారు చేయమని పిల్లలతో చెప్పాలి అలాంటి మరొక సరళ వాక్యాన్ని స్వయంగా చెప్పమని లేదా రాయమని చెప్పాలి.
వాక్య పజిల్:
ఒక వాక్యాన్ని పదాలుగా కట్ చేసి వేరువేరుగా ముద్రించాలి విద్యార్థులను వాటిని సరైన క్రమంలో అమర్చి అర్థవంతమైన వాక్యంగా చేయమని చెప్పాలి.
ENGLISH
Action and fun- verbs:
Jump, clap, sit లాంటి యాక్షన్ పదాలను పిల్లలకు పరిచయం చేయాలి. వాటి అర్ధాన్ని పిల్లలకు చెప్పి వాటి పట్ల అవగాహన కల్పించాలి. ఆ యాక్షన్ పదాలను చెప్పి ఆ పదానికి సంబంధించిన యాక్షన్ ఉపాధ్యాయుడు చేయాలి. అదేవిధంగా పిల్లలతో చేయించాలి . ఎవరైతే సరిగ్గా చేశారో వారిని చప్పట్లతో అభినందించాలి.
Maths
Shapes around us :
Circle, rectangle, triangle, square వంటి ఆకారాలను పిల్లలకు పరిచయం చేయాలి. ఆ ఆకారాలు గల వస్తువులు తరగతిగదిలో ఏమి ఉన్నాయో పిల్లలను చెప్పమనాలి. అదేవిధంగా వారి ఇంటిలో ఆ ఆకారాలు గల వస్తువులు ఏమేమి ఉన్నాయో పిల్లల చేత చెప్పించాలి. వివిధ ఆకారాల్లో గల వారికి తెలిసిన వస్తువులను పిల్లలను చెప్పమనాలి. ఈ విధంగా ఎవరైతే ఎక్కువ ఆకారాలు గల వస్తుందని చెబుతారో వారిని చప్పట్లతో అభినందించాలి.
Shape hunt :
కొన్ని కార్డులపై కొన్ని పిక్చర్స్ ను తీసుకోవాలి అదే విధంగా కొన్ని వస్తువులను తీసుకోవాలి. ఆ వస్తువులను ఆకారాలతో జత పరచమని చెప్పాలి. అదేవిధంగా పిల్లలను వివిధ ఆకారాలు చెప్పి ఆ ఆకారంలో ఉండే వస్తువుల బొమ్మలను గీయమని చెప్పాలి. చక్కగా గీసిన పిల్లలను చప్పట్లతో అభినందించాలి.