విద్యా ప్రవేశ్ 1 , 2 తరగతులు 12వ రోజు (11.07.2025 ) తరగతి సంసిద్ధతా కార్యక్రమం
తెలుగు
కధ : ఒక కథకు సంబంధించిన కృత్యాలను నిర్వహించాలి. తర్వాత కథను చెప్పమని పిల్లలకు చెప్పాలి తర్వాత పిల్లలను కథను సొంతమాటల్లో చెప్పమని అడగాలి తర్వాత కథ గురించి ఎలా ఎందుకు వంటి ప్రశ్నలు అడుగుతూ చర్చించాలి.
ధ్వని ఆటలు :
మొదటి ధ్వని ఏమిటి అని అడుగుతూ రెండు అక్షరాల పదాలను పిల్లలను చెప్పమనాలి.
అక్షరాలతో ఆట:
ఉపాధ్యాయుడు ఏదో ఒక అక్షరం చెప్పాలి విద్యార్థులను ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు చెప్పమనాలి
వ్రాయడం:
ఉపాధ్యాయుడు చెప్పిన ప్రధాన విని పిల్లలు వ్రాయాలి
పాట-పద్యం:
"ఆటలు ఆడి పాటలు పాడి అలసివచ్చెనే" అనే పాటను మరికొంతమంది పిల్లలచే పాడించాలి
ENGLISH
Animal sound game :
పిల్లలకు వివిధ జంతువులు చేసే శబ్దాలను వినిపించి అది ఏ జంతువుదో చెప్పమనాలి. అలాగే ఆ జంతువు గురించి రెండు వాక్యాలు చెప్పమనాలి.
Sound safari game:
ఎవరైతే జంతువు శబ్దాన్ని కరెక్ట్ గా చెప్పారు వారికి ఒక మార్కు ఇవ్వాలి అలాగే ఆ జంతువు గురించి రెండు వాక్యాలు చెప్పిన వారికి బోనస్ గా మరొక మార్కు ఇవ్వాలి. ఇలా ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారిని చప్పట్లతో అభినందించాలి.
Maths
Picture sequencing :
ఏదైనా ఒక కథకు సంబంధించి మూడు లేదా నాలుగు పిక్చర్స్ చూపించాలి. వాటిలో ఏ పిక్చర్ మొదట వస్తుంది తర్వాత ఏది వస్తుంది అనే వరుసక్రమాన్ని పిల్లలను పెట్టమనాలి. అప్పుడు కథలు వరుసగా చెప్పమనాలి. ఎవరైతే ఆ పిక్చర్స్ను సరైన క్రమంలో అమర్చారు వారికి sequence star బ్యాడ్జి ఇచ్చి అభినందించాలి
Readiness activity
Sound hunt
ఉపాధ్యాయుడు పేపర్ నలిపినశబ్దం, పెన్సిల్ బాక్స్శబ్దం, బొమ్మ, గంట మొదలైన వాటి శబ్దాన్ని పిల్లలకు వినిపించాలి. తరగతి గదిలో వాటి శబ్దాన్ని చేస్తూ పిల్లలను అది ఏ శబ్దమో చెప్పమనాలి. అలా ఎవరైతే సరైన శబ్దాన్ని చెప్పారో వారిని చప్పట్లతో అభినందింప చేయాలి.