3మరియు 5 తరగతుల 21 వ రోజు 23.07.2025 తరగతి సంసిద్ధతా కార్యక్రమం.
తెలుగు
నామవాచక పదాలను గుర్తించడం మరియు చదవడం నేర్పించాలి. వ్యక్తులు,జంతువులు, వస్తువుల చిత్రాలు ఉన్న ఫ్లాష్ కార్డులు లేదా చార్ట్స్ చూపించాలి ప్రతి పదాన్ని స్పష్టంగా చదివి చెప్పాలి ఉదాహరణకు అమ్మ చిలక పుస్తకం.
చిత్ర కార్డులను జంతువులు, వ్యక్తులు,వస్తువులు అనే వర్గాలుగా వేరు చేయమని చెప్పాలి
ఆట :
🌻 బుట్టలో వాటి పేరు చెబుదాం 🌻 ఒక బుట్టలో చిత్రాలు మరొక బట్టలు పదాల కార్డులు ఉంచాలి. విద్యార్థులు ఒక్కొక్కటి తీసుకుని సరైన జత చేయాలి ఉదాహరణకు పిల్లి చిత్రం పిల్లి అనే పదమున్న కార్డుతో జతపరచాలి. అదేవిధంగా పిల్లలకు చిత్రాలు చూపించి వాటితో ఐదు నామవాచక పదాలను రాయమని లేదా చెప్పమని చెప్పాలి.
ENGLISH
Healthy food ( sentences) :
Eat అలాగే Apple అనే పదాలను ఉపయోగించి సెంటెన్స్ రాయమని చెప్పాలి. ఉదాహరణకు I eat an apple. ఇలాగ బోర్డుపై కొన్ని ఉదాహరణలు రాయాలి పిల్లల చేత కొన్ని వాక్యాలు రాయించాలి ప్రతి వాడు కనీసం రెండు సెంటెన్స్ లో ఫుడ్ ఐటమ్స్ ఉపయోగిస్తూ వ్రాసేలా చేయాలి. అదేవిధంగా శుభ్రంగా అందమైన చేతిరాతతో రాసేలాగా చూడాలి స్పెల్లింగ్ తప్పు లేకుండా రాసేలా చూడాలి.
Food images మరియు food sentence లతో ఫుడ్ బింగో ఆట ఆడించాలి ఎవరైతే పిక్చర్ ఉపయోగిస్తూ సరైన సెంటెన్స్ చెప్పారో లేదా గట్టిగా చదువుతూ సరిగ్గా జతపరిచారో వారిని చప్పట్లతో అభినందించాలి.
Maths
Number and operation revision:
నంబర్స్ 1 నుండి 100 వరకు పిల్లలచే రివైజ్ చేయించాలి. అదేవిధంగా తేలికగా చెప్పగలిగేలా నోటి కూడికలు తీసివేతలు వేగంగా చెప్పేలా ప్రాక్టీస్ చేయించాలి. అదేవిధంగా చిన్న చిన్న కూడికలు తీసివేతలు బ్లాంక్స్ రూపంలో ఇచ్చి పిల్లల చేత చేయించాలి. పిల్లలకు నోటి కూడికలు తీసివేతలు ఇచ్చి వేగంగా జవాబు చెప్పమనాలి. ఎవరైతే వేగంగా చెప్పగలుగుతారో వారిని అభినందించాలి. అదేవిధంగా 2 డిజిట్స్ నెంబర్ తో 1 డిజిట్ నెంబర్ కు ఎడిషన్,సబ్ట్రాక్షన్ ఇచ్చి చేయించాలి.<, >, = గుర్తులను ఉపయోగించే విధానాన్ని బోర్డుపై revise చేయాలి. ఈ విధంగా ఏ పిల్లలైతే చక్కగా చేస్తారో వారిని చప్పట్లు తో అభినందించాలి.